పల్లె పండుగలతో ఆదర్శంగా నిలవాలి
*మహిళలకు చీరలు పంపిణీ చేసిన శ్రీనివాస్ రెడ్డి
కాకతీయ, ఇనుగుర్తి: పల్లెల్లో ప్రకృతి సాంప్రదాయకంగా నిర్వహించే పండుగలను ఆచరిస్తూ ఆటలలో ఆరోగ్య నియమాలు పాటిస్తూ ముందు తరాలకు ఆదర్శంగా నిర్వాలని బిఆర్ఎస్ మహబూబాబాద్ డివిజన్ యూత్ ఉపాధ్యక్షులు బండారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చిన్ననాగారం లోని ఒకటో వార్డులో బొడ్డెమ్మ పండుగ సందర్భంగా 15 వేల విలువగల చీరలు మరియు కోలలు ఆ కాలనీ ఆడపడుచులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆచార సాంప్రదాయాలను ఆకట్టుకునే విధంగా ఆడపడుచులు పండుగలు నిర్వహించి ఆచరించడం అభినందనీయమన్నారు. అనంతరం ఆడపడుచులు తమకు చీరలు పంపిణీ చేసిన శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

