పండుగ వేళ గ్రామానికి కొత్త శోభ.. ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు..
కాకతీయ, చందుర్తి :దసరా, సద్దుల బతుకమ్మ పండుగల సందర్భంగా చందుర్తి మండలం రామారావుపల్లి గ్రామంలో పండుగ శోభ వెల్లివిరిసింది. గ్రామ సర్పంచ్ నారాగుల వాణి గంగస్వామి ఆధ్వర్యంలో గ్రామంలోని అన్ని వీధులతో పాటు బతుకమ్మ తెప్ప, చెరువు పరిసరాల్లో ప్రత్యేకంగా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. దీంతో రాత్రివేళ గ్రామం విద్యుత్ కాంతులతో కళకళలాడుతూ పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. పండుగకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన సర్పంచ్ను గ్రామస్తులు అభినందించారు.

