epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గ్రామాల అభివృద్ధే లక్ష్యం.. కిష్టంపేటకు మరిన్ని నిధులు తెస్తా!

గ్రామాల అభివృద్ధే లక్ష్యం.. కిష్టంపేటకు మరిన్ని నిధులు తెస్తా!

రూ.20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవనానికి భూమిపూజ

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

కాకతీయ,చందుర్తి: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ భవనానికి ఆయన భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. కిష్టంపేటతో పాటు మండలంలోని ఇతర గ్రామాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, లింక్ రోడ్ల నిర్మాణానికి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత సమష్టిగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

రైతుల సంక్షేమానికి పెద్దపీట

రైతులకు సాగునీరు, విద్యుత్, పంటల కొనుగోలు వంటి అంశాల్లో ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కిష్టంపేటలో సుమారు 90 శాతం మంది రైతులకు రుణమాఫీ ద్వారా ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు. చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి రైతులకు మేలు జరుగుతుందని అన్నారు.

పేదలకు ఇందిరమ్మ ఇళ్లు

నిరుపేదలకు ఇళ్ల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆది శ్రీనివాస్ తెలిపారు. గతంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా, ప్రస్తుతం మరో 2,000 ఇళ్ల మంజూరు ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. అర్హులైన పేదలకు ఇళ్లను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

1995లో జిల్లా పరిషత్‌కు ఎన్నికైనప్పటి నుంచి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నానని గుర్తుచేశారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, గ్రామాల అవసరాలకు అనుగుణంగా డ్రైనేజీ, సీసీ రోడ్లు, తాగునీరు, విద్య, రహదారుల వంటి పనులను దశలవారీగా చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు.

రాజకీయాలు ఎన్నికలకే పరిమితం కావాలని, గ్రామాభివృద్ధి విషయంలో పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని ఆది శ్రీనివాస్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రైతుల సంక్షేమం, పేదలకు ఇళ్ల కల్పనే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడలో సద్దుల బతుకమ్మ సంబరాలు!

వేములవాడలో సద్దుల బతుకమ్మ సంబరాలు! పూల పండుగలో ఆడపడుచుల ఆటపాటలు కోలాటం ఆడి.. డోలు...

అర్హులైన పేదలకు న్యాయం చేయాలి

అర్హులైన పేదలకు న్యాయం చేయాలి ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఓదెల...

80 ఫీట్ల రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

80 ఫీట్ల రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి రాజన్న ఆలయ విస్తరణ,...

పండుగ వేళ గ్రామానికి కొత్త శోభ.. ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు

పండుగ వేళ గ్రామానికి కొత్త శోభ.. ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు.. కాకతీయ, చందుర్తి...

రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: మ్యకల ఎల్లయ్య

రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: మ్యకల ఎల్లయ్య - కరెంట్ కోతలు,...

కరీంనగర్ డైరీ పాడి రైతులకు బోనస్ పంపిణీ

కరీంనగర్ డైరీ పాడి రైతులకు బోనస్ పంపిణీ దసరా పండుగ కానుకగా 64...

జర్నలిస్టులపై చిత్రహింసల ఘటనపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి

జర్నలిస్టులపై చిత్రహింసల ఘటనపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి గంభీరావుపేట ఎస్సైని సస్పెండ్...

రైతుల సంక్షేమం.. అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం!

రైతుల సంక్షేమం.. అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం! రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.