epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బాలుడి మృతదేహంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముట్టడి

బాలుడి మృతదేహంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముట్టడి
నిర్లక్ష్యం వహించిన వైద్య సిబ్బంది సస్పెండ్ చేయాలంటూ ఆగ్రహం
మంత్రి సీతక్క హామీతో ధర్నా విరమణ

కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని గూర్రేవుల గ్రామంలో 7 ఏళ్ల బాలుడు పాము కాటుతో మృతి చెందిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. గూర్రేవుల గ్రామానికి చెందిన తిరునగిరి రాజు, సంగీత దంపతుల కుమారుడు హరినాథ్ (7) శనివారం సాయంత్రం ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా నాగుపాము కాటు వేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే విధుల్లో ఉన్న వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో అక్కడ ఉన్న స్టాఫ్ నర్స్ “యాంటీడోస్ ఇంజెక్షన్ లేదు” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తదుపరి నాటు వైద్యుడి వద్దకు బాలుడిని తీసుకెళ్లగా, పరిస్థితి విషమించడంతో ఆయన చికిత్సకు నిరాకరించాడు. అనంతరం 108 అంబులెన్సులో ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులు ఆదివారం కన్నాయిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద బాలుడి మృతదేహంతో ముట్టడి చేపట్టారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేరని, ప్రథమ చికిత్స కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని భద్రతా ఏర్పాట్లు చేశారు. అనంతరం గ్రామస్తులు, బంధువులు కలిసి ఏటూరునాగారం–తుపాకులగూడెం ప్రధాన రహదారిపై సుమారు రెండు గంటలపాటు మృతదేహంతో ధర్నా నిర్వహించారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే బాలుడు ప్రాణాలు కోల్పోయాడని, బాధ్యులైన వైద్యుడు అభినవ్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని, జిల్లా కలెక్టర్ దర్యాప్తు జరపాలని వారు డిమాండ్ చేశారు.

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు — మంత్రి సీతక్క

ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకుడు యం.డి. అప్సర్ పాషా ఫోన్ ద్వారా మంత్రి సీతక్కకు సమాచారం అందజేశారు. దీనిపై స్పందించిన మంత్రి సీతక్క బాలుడి మృతిపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించి ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారికి, కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. అలాగే కన్నాయిగూడెం మండలంలో 24 గంటల వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నాను విరమించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.