epaper
Saturday, October 31, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పంచాయతీల్లో నిధులు గోల్‌మాల్‌

పంచాయతీల్లో నిధులు గోల్‌మాల్‌
ములుగు జిల్లా పంచాయ‌తీల్లో అవినీతి బాగోతం
చెల్లింపుల్లో అక్రమాలు.. రికార్డుల్లో ఫోర్జరీ సంత‌కాలు
మంగపేటలో మూడు పంచాయతీల్లో వివాదాలు
వెంకటాపురం, వాజేడులోనూ అవకతవకలు
జిల్లాలో ఏసీబీ దాడులు చేపట్టాలని ప్రజల డిమాండ్‌

కాకతీయ, ములుగు : గ్రామాల అభివృద్ధికి వెచ్చించాల్సిన ప్రజాధనం అక్రమాల పాలవుతోందన్న ఆరోపణలు ములుగు జిల్లాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. గ్రామ పంచాయతీల్లో నిధుల వినియోగం మొదలుకొని చెల్లింపులు, వేలం ఆదాయం, అధికారిక రికార్డుల నిర్వహణ వరకు అనేక అవకతవకలు వెలుగుచూస్తుండటం పంచాయతీ పాలనలోని డొల్లతనాన్ని బట్టబయలు చేస్తోంది. గ్రామసభ తీర్మానాలు లేకుండానే నిధుల చెల్లింపులు, వేలం ఆదాయానికి లెక్కలు లేకపోవడం, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు, రికార్డుల్లో సంతకాల ఫోర్జరీ.. ఇలా ఒక్కో వ్యవహారం బయటపడుతుండటంతో అవినీతి ఆరోపణలు మరింత బలపడుతున్నాయి. మంగపేట మండలంలో మూడు పంచాయతీల్లో నిధుల గోల్‌మాల్‌పై వివాదాలు రేగగా, వెంకటాపురం, వాజేడు మండలాల్లోనూ అక్రమాలపై అధికారుల చర్యలు చోటుచేసుకున్నాయి. వరుస ఘటనలతో పంచాయతీ పాలనపై అనుమానాలు ముసురుకుంటుండగా, తెరవెనుక మరెన్ని అక్రమాలు ఉన్నాయన్న చర్చ జిల్లావ్యాప్తంగా జోరందుకుంది.

మూడు పంచాయతీల్లో నిధుల గోల్‌మాల్‌..

మంగపేట మండలంలోని మంగపేట, మల్లూరు, నిమ్మగూడెం గ్రామ పంచాయతీల్లో వెలుగుచూస్తున్న వ్యవహారాలు పంచాయతీ పాలనలోని అక్రమాలను బట్టబయలు చేస్తున్నాయి. మంగపేట పంచాయతీలో ప్రత్యేక అధికారి నియామకం తర్వాత జరిగిన చెల్లింపులు తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయి. అప్పటి జిల్లా కలెక్టర్‌ దివాకర్‌ టి.ఎస్‌. 2026 ఫిబ్రవరి 24న ఎంపీఓ మహేందర్‌ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా కేవలం నాలుగు రోజులకే అంటే ఫిబ్రవరి 28న బానోత్‌ భద్రు పేరుతో 11 చెల్లింపులు జరిగినట్లు రికార్డుల్లో నమోదయ్యాయి. ఇందులో సీహెచ్‌ లక్ష్మణ్‌కు 5, సీహెచ్‌ రాజేశ్వరరావుకు 4, ఎస్‌.ఆర్‌.సీతకు 2 చెల్లింపులు చేసినట్లు సమాచారం. ప్రత్యేక అధికారి నియామకం తర్వాత ఈ చెల్లింపులు ఏ ప్రాతిపదికన జరిగాయి? వాటికి అనుమతులు ఎవరిచ్చారు? అప్పటి పంచాయతీ కార్యదర్శి బోట సురేష్‌ పాత్ర ఏమిటన్నది ఇప్పుడు కీలకంగా మారింది. అక్టోబర్‌ 9న ఎంపీఓ మహేందర్‌ పంచాయతీ రికార్డులను స్వాధీనం చేసుకోగా కమలాపురానికి బదిలీ అయిన బోట సురేష్‌ను రికార్డుల అప్పగింత కోసం పిలిపించినట్లు సమాచారం. మరోవైపు నిమ్మగూడెం పంచాయతీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐదో ఆర్థిక సంఘం నిధులు రూ.7,29,900 వినియోగంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. గ్రామసభ ఆమోదం లేకుండానే 28 వోచర్ల ద్వారా చెల్లింపులు చేసినట్లు విచారణలో గుర్తించడంతో కార్యదర్శి సంపత్‌ను జిల్లా కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. ఇక మల్లూరు పంచాయతీలో కొబ్బరి వేలం ఆదాయం మరో వివాదానికి కేంద్రంగా మారింది. 2016 నుంచి వేలం ద్వారా వచ్చిన సుమారు రూ.20 లక్షల ఆదాయాన్ని దుర్వినియోగం చేశారని వ్యాపారి యారంగారి వీరన్‌కుమార్‌ ఆరోపిస్తూ సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరారు. దీనిపై అక్టోబర్‌ 23న ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శితో కమిషన్‌ విచారణ నిర్వహించి పూర్తి వివరాలు అందించాలని ఆదేశించింది. సమాచారం ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఒకే మండలంలోని మూడు పంచాయతీల్లో నిధుల చెల్లింపులపై అనుమానాలు, ఆర్థిక లావాదేవీలపై వివాదాలు, వేలం ఆదాయంపై ఆరోపణలు వెల్లువెత్తడం మంగపేటలో పంచాయతీ నిధుల నిర్వహణ ఎంత గందరగోళంగా మారిందో స్పష్టం చేస్తోంది.

ఆ గ్రామ పంచాయతీల్లో సంత‌కాలు ఫోర్జ‌రీ..

మంగపేట మండలంలోనే కాకుండా వెంకటాపురం, వాజేడు మండలాల్లోనూ పంచాయతీల్లో అవకతవకలు వెలుగుచూడటం జిల్లావ్యాప్తంగా కలకలం రేపుతోంది. వెంకటాపురం మండలం సురవీడు గ్రామ పంచాయతీలో నిధుల వినియోగంపై జరిగిన విచారణలో పలు అక్రమాలు బయటపడ్డాయి. గ్రామ పంచాయతీ తీర్మానాలు లేకుండానే కార్యాలయ నిర్వహణ, డ్రైనేజీ పూడికతీత పనులకు చెల్లింపులు చేయడంతోపాటు, ఆర్‌డబ్ల్యూఎస్‌ అనుమతి లేకుండా హ్యాండ్‌పంపుల సామగ్రి కోసం రూ.2.30 లక్షలు వెచ్చించినట్లు గుర్తించారు. సరఫరాదారులకు కాకుండా వ్యక్తులకు చెల్లింపులు చేయడం, డీజిల్‌ లాగ్‌బుక్‌లో వ్యత్యాసాలు ఉండటం వంటి అంశాలు కూడా విచారణలో వెలుగుచూశాయి. ఈ వ్యవహారంలో సర్పంచ్‌ ఇర్పా మురళి, ఉపసర్పంచ్‌ కొర్సా మురళీకృష్ణలను ఆరు నెలల పాటు సస్పెండ్‌ చేయగా, అప్పటి పంచాయతీ కార్యదర్శి పాత్రపైనా విచారణ కొనసాగుతోంది. ఇక వాజేడు మండలం ధర్మవరం గ్రామ పంచాయతీలో ఏకంగా సర్పంచ్‌ సంతకాల ఫోర్జరీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సర్పంచ్‌ సుమతి సంతకాలను ఔట్‌సోర్సింగ్‌ కార్యదర్శి ప్రసాద్‌ గ్రామసభ, తీర్మానాల రిజిస్టర్లలో ఫోర్జరీ చేసినట్లు విచారణలో నిర్ధారణ కావడంతో ఆయనను విధుల నుంచి తొలగించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఆయన స్థానంలో చెరుకూరు పంచాయతీ కార్యదర్శి రేఖాశ్రీకి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు ఎంపీడీఓ కృపాకర్‌ తెలిపారు. ఒకచోట నిధుల వినియోగంలో అక్రమాలు.. మరోచోట అధికారిక రికార్డుల్లోనే సంతకాల ఫోర్జరీ.. ఇలా ములుగు జిల్లాలో వరుసగా బయటపడుతున్న పంచాయతీ వ్యవహారాలు పాలనా యంత్రాంగంలో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.

ములుగు పంచాయతీలపైనా నిఘా పడేనా?

రాష్ట్రవ్యాప్తంగా అవినీతి అధికారులపై ఏసీబీ కొరడా ఝళిపిస్తూ అక్రమార్కుల భరతం పడుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో పంచాయతీ కార్యదర్శులతో పాటు వివిధ శాఖల అధికారులు లంచాలు తీసుకుంటూ పట్టుబడిన ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలో ములుగు జిల్లాలోనూ గ్రామ పంచాయతీల్లో వరుసగా బయటపడుతున్న అక్రమాలు కలకలం రేపుతున్నాయి. మంగపేట, వెంకటాపురం, వాజేడు మండలాల్లో నిధుల వినియోగం, చెల్లింపులు, వేలం ఆదాయం, రికార్డుల నిర్వహణలో అవకతవకలు వెలుగుచూడటంతో పంచాయతీ పాలనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ఘటనల్లో ఇప్పటికే అధికారులపై చర్యలు తీసుకున్నా, తెరవెనుక మరిన్ని అక్రమాలు ఉండొచ్చన్న సందేహాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిర్యాదులు అందిన పంచాయతీలకే పరిమితం కాకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల ఆర్థిక లావాదేవీలపై ఏసీబీ ప్రత్యేక నిఘా పెట్టాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. ప్రభుత్వ నిధుల ఖర్చు, బ్యాంకు ఖాతాలు, బిల్లులు, వోచర్లు, గ్రామసభ తీర్మానాలు, వేలం ఆదాయం, రికార్డుల నిర్వహణపై సమగ్ర తనిఖీలు చేపట్టి, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ దాడులు ముమ్మరమైన వేళ ములుగు జిల్లాలోనూ పంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజాధనం దుర్వినియోగంపై లోతైన విచారణ జరపాలని జిల్లావాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మోహన్‌ గ్రానైట్‌ క్వారీ మూసివేతకు ఆదేశాలు!

మోహన్‌ గ్రానైట్‌ క్వారీ మూసివేతకు ఆదేశాలు! లీజు గడువు ముగిసినా కొనసాగుతున్న తవ్వకాలు తండావాసుల...

పర్యాటకమే ప్రాణం.. ఓరుగల్లు కీర్తే లక్ష్యం!

పర్యాటకమే ప్రాణం.. ఓరుగల్లు కీర్తే లక్ష్యం! చరిత్రను పరిచయం చేస్తూ.. వారసత్వ సంపదకు...

భూ గ‌ద్ద‌లు

భూ గ‌ద్ద‌లు కాజీపేట‌లో భూ గోల్‌మాల్‌ వైఎస్సార్ న‌గ‌ర్ గుడిసెల‌పై భూదందా నీడ! వంద‌ల కోట్ల...

ఆరుతడి పంటలు సాగు చేయాలి

ఆరుతడి పంటలు సాగు చేయాలి ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులపై అవగాహన తక్కువ నీటితో...

ఏక్తా దివస్‌ రన్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల ఉత్సాహం

ఏక్తా దివస్‌ రన్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల ఉత్సాహం 5కే, 10కే పరుగుల్లో వందమంది...

మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి

మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి బాలికల గురుకులంలో ప్ర‌త్యేకాధికారి అనురాధ ఆకస్మిక తనిఖీలు ఆహార...

యూత్‌ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌!

యూత్‌ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌! బీజేవైఎం మండల అధ్యక్షుడు రాచర్ల రాజేష్‌...

పెంచికలపేట పీఏసీఎస్‌కు కొత్త సారథి!

పెంచికలపేట పీఏసీఎస్‌కు కొత్త సారథి! చైర్మన్‌గా ఎగితే లింగన్న బాధ్యతల స్వీకరణ గ్రామానికి తొలిసారి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.