ఎస్ఐఆర్లో బీఎల్ఓల పాత్ర కీలకం
పరకాల నియోజకవర్గం రాష్ట్రంలోనే తొలిస్థానంలో నిలిచింది
సేవలను అభినందించిన అధికారులు : పరకాల ఆర్డీవో డీఎస్ వెంకన్న
కాకతీయ, ఆత్మకూరు : ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయడంలో బూత్ లెవల్ అధికారుల పాత్ర కీలకమని పరకాల ఆర్డీవో డీఎస్ వెంకన్న అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో తహసీల్దార్ ఎన్. జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా పరకాల నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచేలా ప్రక్రియను పూర్తి చేసిందని తెలిపారు. ప్రతి బూత్ లెవల్ అధికారి సమర్థంగా పనిచేసి ప్రక్రియ విజయవంతానికి కృషి చేశారని అభినందించారు. బీఎల్ఓలను ముందుండి నడిపించిన తహసీల్దార్ ఎన్. జగన్మోహన్రెడ్డి సేవలను ప్రశంసించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను కూడా సమర్థంగా నిర్వహించాలని బీఎల్ఓలకు సూచించారు. అనంతరం అన్ని గ్రామాలకు చెందిన బీఎల్ఓలను ఆర్డీవో డీఎస్ వెంకన్న, తహసీల్దార్ ఎన్. జగన్మోహన్రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి శాలువాలతో సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో అదనపు తహసీల్దార్ మమత, మండల గిర్దావర్ హారిక, ఫారూఖ్, జీపీఓలు తదితరులు పాల్గొన్నారు.

