epaper
Tuesday, October 6, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మానాలకు మహర్దశ

మానాలకు మహర్దశ
మూడు కీలక రహదారులకు రూ.14.20 కోట్లతో శంకుస్థాపన
మానాల ప్రధాన రహదారి నాలుగు వరుసలుగా విస్తరణ
సూరమ్మ చెరువు నుంచి ఎత్తిపోతలతో సాగు, తాగునీరు
మరిమడ్ల రహదారికి రూ.7.43 కోట్లు, హనుమాన్‌ తండాకు రూ.1.17 కోట్లు
మానాల ప్రజల చిరకాల నీటి సమస్యకు పరిష్కారం చూపుతాం
: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, బోధన్‌ ఎమ్మెల్యే పి. సుదర్శన్‌రెడ్డి

కాకతీయ, రుద్రంగి: మానాల ప్రజల చిరకాల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, బోధన్‌ ఎమ్మెల్యే పి. సుదర్శన్‌రెడ్డి తెలిపారు. కలిగోట సూరమ్మ చెరువు పనులు తుది దశకు చేరుకున్నాయని, జలాశయం నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా మానాలకు సాగు, తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రహదారి పనులను త్వరగా ప్రారంభించి వేగంగా పూర్తిచేస్తామని తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలో మంగళవారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, బోధన్‌ ఎమ్మెల్యే పి.సుదర్శన్‌రెడ్డి, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మాజీ నిజామాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు, మాజీ యూనియన్‌ కో-ఆపరేటివ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డితో కలిసి పనులకు శ్రీకారం చుట్టారు. మానాల గ్రామానికి కీలకమైన మూడు రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.14.20 కోట్ల నిధులు కేటాయించింది. ఇందులో మరిమడ్ల రహదారి నిర్మాణానికి రూ.7.43 కోట్లు, మానాల ప్రధాన రహదారిని రెండు వరుసల నుంచి నాలుగు వరుసలుగా విస్తరించేందుకు రూ.5.60 కోట్లు, హనుమాన్‌ తండా గొర్రెగుండం రహదారి నిర్మాణానికి రూ.1.17 కోట్లు కేటాయించారు. పనులు పూర్తయితే గ్రామానికి రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని సుదర్శన్‌రెడ్డి తెలిపారు.

సూరమ్మ చెరువు నుంచి నీరు

కలిగోట సూరమ్మ చెరువు పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఎత్తిపోతల పథకం ద్వారా మానాలకు సాగు, తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. మానాల ప్రజలు చాలాకాలంగా ఎదుర్కొంటున్న నీటి సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పారు. రహదారి నిర్మాణ పనులను కూడా త్వరలో ప్రారంభించి నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ మానాల గ్రామానికి ప్రత్యేకమైన ఉద్యమాల చరిత్ర ఉందన్నారు. ప్రజా పాలనలో ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం, ఉచిత విద్యుత్‌, ఉచిత బస్సు ప్రయాణం, కొత్త రేషన్‌ కార్డులు, రైతుబంధు, రుణమాఫీతోపాటు వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. తనకు ఘన స్వాగతం పలికిన మానాల గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

మానాల పేరే ఇంటిపేరుగా

మాజీ నిజామాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు, మాజీ యూనియన్‌ కో-ఆపరేటివ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డి మాట్లాడుతూ మానాల గ్రామం పేరునే తన ఇంటిపేరుగా పెట్టుకుని ప్రజల ఆదరాభిమానాలతో ఎదిగానని భావోద్వేగానికి గురయ్యారు. గ్రామ ప్రజల ప్రేమ, ప్రోత్సాహమే తన ఎదుగుదలకు కారణమని పేర్కొంటూ కంటతడి పెట్టారు. గిరిజనులకు పోడు పట్టాల పునరుద్ధరణతోపాటు సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని సుదర్శన్‌రెడ్డిని కోరారు. రానున్న రోజుల్లో బాల్కొండ వర్గానికి ప్రాతినిధ్యం వహించాలన్న తన మనసులో మాటను ప్రజల ముందుంచారు. సూరమ్మ చెరువు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా మానాలకు నీటిని అందించాలన్న విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించినందుకు మానాల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బుర్ర శంకర్‌గౌడ్‌, ఉప సర్పంచ్‌ దాసరి అశోక్‌, ఉర్దూ అకాడమీ కార్పొరేషన్‌ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హైమద్‌, తహసీల్దార్‌ పుష్పలత, ఎంపీడీవో నటరాజ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చేలకల తిరుపతి, చందుర్తి సీఐ రవీందర్‌, ఎస్సై మోతీరామ్‌ నాయక్‌, రిటైర్డ్‌ ఏడీఈ భూక్య లక్ష్మణ్‌, తూమ్‌ జలపతి, కొమ్ముల రవీందర్‌, విడీసీ చైర్మన్‌ జక్కుల శ్రీనివాస్‌, జక్కు మోహన్‌, లక్కాకుల శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, పలువురు సర్పంచులు, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంక్రీట్‌తో రాజన్న గుడి నిర్మాణమా?

కాంక్రీట్‌తో రాజన్న గుడి నిర్మాణమా? కృష్ణశిలతో ఆగమ శాస్త్రం ప్రకారం రాజన్న ఆలయాన్ని...

కొండాపూర్‌లో నీటి కోసం రాస్తారోకో

కొండాపూర్‌లో నీటి కోసం రాస్తారోకో నీళ్ల బిందెలతో హుస్నాబాద్‌–కరీంనగర్‌ రహదారి దిగ్బంధం ఫోర్‌లైన్‌ పనులతో...

శ్మ‌శాన భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి

శ్మ‌శాన భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి దళితుల సమాధుల ధ్వంసంపై చర్యలు తీసుకోవాలి శంకరపట్నం...

శంకరపట్నంలో సేవా సంకల్ప్‌ యాత్రకు స్వాగతం

శంకరపట్నంలో సేవా సంకల్ప్‌ యాత్రకు స్వాగతం టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌...

శంకరపట్నంలో సేవా సంకల్ప్‌ యాత్రకు స్వాగతం

శంకరపట్నంలో సేవా సంకల్ప్‌ యాత్రకు స్వాగతం టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌...

అవార్డులు మరింత బాధ్యతను పెంచుతాయి

అవార్డులు మరింత బాధ్యతను పెంచుతాయి మొలంగూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కంకణాల నీరజ కాకతీయ,శంకరపట్నం:...

లీకేజీలతో తాగునీరు వృథా.. అధికారుల నిర్లక్ష్యం

లీకేజీలతో తాగునీరు వృథా.. అధికారుల నిర్లక్ష్యం నెలలు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు.. రోడ్డుపై...

కష్టకాలంలో అండగా నిలిచిన ఉపసర్పంచ్ గట్టు శ్రావణ్

కష్టకాలంలో అండగా నిలిచిన ఉపసర్పంచ్ గట్టు శ్రావణ్ కాకతీయ, శంకరపట్నం : ముత్తారం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.