రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
కాకతీయ,రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని మైలారం గ్రామంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఓ మహిళ దారుణంగా ప్రాణాలు కోల్పోయింది.స్థానికులు,పోలీసులు తెలిపిన వివరాల మేరకు…మైలారం గ్రామానికి సరస్వతి (48)రోడ్డు దాటుతున్న క్రమంలో అతివేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం ఆమెను వెనక నుంచి బలంగా ఢీకొట్టింది.దింతో సరస్వతి రెండు కాళ్లు నుజ్జు నుజ్జు కాగా..తలకు బలమైన గాయమవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.ప్రమాదానికి కారణమైన వాహనం ఆపకుండా డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు.సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై ముత్యం రాజేందర్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతురాలు కుమార్తె గడి దాసు నవ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని,పరారైన వాహనం జాడను కనుగొనేందుకు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

