బంగారం చోరీ కేసులో వ్యక్తి అరెస్టు
కాకతీయ, పెద్దవంగర : బంగారం చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తొర్రూరు డివిజన్ సీఐ గణేష్ తెలిపారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పెద్దవంగర మండలం అవుతాపురం గ్రామానికి చెందిన గద్దల పద్మ బుధవారం తన ఇద్దరు కుమార్తెలను ఇంటి వద్ద ఉంచి ఊరికి వెళ్లారు. రాత్రి ఇద్దరు కుమార్తెలు బంధువుల ఇంట్లో నిద్రించేందుకు వెళ్లారు. గురువారం ఉదయం ఇంటికి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉండటంతో పాటు ఇంట్లోని 8 తులాల బంగారం అపహరణకు గురైనట్లు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం నిందితుడిని అరెస్టు చేశారు. చోరీకి గురైన బంగారాన్ని రికవరీ చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ ప్రమోద్‌కుమార్, ఏఎస్‌ఐ రాజారాం, కానిస్టేబుళ్లు ఈర్య నాయక్, మహేందర్, ప్రశాంత్ పాల్గొన్నారు.

