epaper
Friday, October 9, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రీజినల్‌ ఐ హాస్పిటల్‌ను తరలిస్తే సహించేది లేదు

రీజినల్‌ ఐ హాస్పిటల్‌ను తరలిస్తే సహించేది లేదు
ఉత్తర తెలంగాణ పేదలకు ఆసుపత్రి అండగా ఉంది
కొత్త సూపర్‌ స్పెషాలిటీ పేరుతో అన్యాయం చేయొద్దు
130 పడకల ఆసుపత్రిని బలోపేతం చేయాలి
వైద్యులు, సిబ్బంది, ఆధునిక పరికరాలు పెంచాలి
పేదల కంటి చూపుతో చెలగాటం ఆడితే పోరాటం
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌

కాకతీయ, తెలంగాణ బ్యూరో : వరంగల్‌ రీజినల్‌ ఐ హాస్పిటల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించవద్దని, తరలించవద్దని, నిర్వీర్యం చేయవద్దని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. దశాబ్దాలుగా ఉత్తర తెలంగాణలోని లక్షలాది మంది పేదలకు కంటి వైద్యం అందిస్తున్న ఆసుపత్రిని బలహీనపరిచే నిర్ణయం తీసుకుంటే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. సుమారు 36–38 ఏళ్ల క్రితం వరంగల్‌లో ఏర్పాటైన రీజినల్‌ ఐ హాస్పిటల్‌ ఉత్తర తెలంగాణ ప్రజలకు ప్రధాన కంటి వైద్య కేంద్రంగా మారిందని వినోద్‌కుమార్‌ తెలిపారు. ఆదిలాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వరంగల్‌, హనుమకొండ, మహబూబాబాద్‌, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, సూర్యాపేట, నిజామాబాద్‌ తదితర జిల్లాల నుంచి ప్రతిరోజూ వేలాది మంది వస్తున్నారని అన్నారు.

కొత్త ఆసుపత్రి పేరుతో అన్యాయం వద్దు

వృద్ధాప్య కంటి సమస్యలు, కేటరాక్ట్‌ తదితర సమస్యలకు పేదలకు ఇక్కడ వైద్యం అందుతోందని, పెద్ద సంఖ్యలో ఓపీ సేవలతో పాటు కంటి ఆపరేషన్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సుమారు 130 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆసుపత్రిని కొత్త సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో విలీనం చేస్తారనే ప్రచారంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. సంబంధిత అధికారులతో మాట్లాడగా రీజినల్‌ ఐ హాస్పిటల్‌ కొనసాగుతుందని, తొలగించే నిర్ణయం లేదని స్పష్టం చేసినట్లు వినోద్‌కుమార్‌ తెలిపారు. అయితే ప్రస్తుతం ఒక మాట చెప్పి భవిష్యత్తులో మరో నిర్ణయం తీసుకోవద్దని, ఆసుపత్రిని యథాతథంగా కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
రీజినల్‌ ఐ హాస్పిటల్‌కు అవసరమైన వైద్యులు, సిబ్బందిని నియమించాలని, ఆధునిక కంటి వైద్య పరికరాలు సమకూర్చాలని, పడకల సంఖ్య పెంచాలని కోరారు. కంటి ఆపరేషన్ల సామర్థ్యాన్ని పెంచి ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే పేదలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. రీజినల్‌ ఐ హాస్పిటల్‌ కేవలం భవనం లేదా ఆసుపత్రి సమస్య కాదని, ఉత్తర తెలంగాణలోని లక్షలాది మంది పేదల కంటి చూపు సమస్య అని వినోద్‌కుమార్‌ అన్నారు. దశాబ్దాలుగా పేదలకు వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రిని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరిగితే బీఆర్ఎస్‌ ప్రజల తరఫున గట్టిగా పోరాడుతుందని స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు బీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు బీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు 13నుంచి సమ్మెకు దిగుతున్న ఉద్యోగులకు...

నైరుతి రుతుపవనాల తిరోగమనం

నైరుతి రుతుపవనాల తిరోగమనం జనగాం, భూపాలపల్లి మీదుగా కొనసాగుతున్న ఉపసంహరణ కాకతీయ, తెలంగాణ బ్యూరో...

రేవంత్‌, కేసీఆర్‌ ఆస్తులపై విచారణ జరపాలి

రేవంత్‌, కేసీఆర్‌ ఆస్తులపై విచారణ జరపాలి కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ ఆరోపణలపై న్యాయ విచారణ...

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డికి బెయిల్‌

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డికి బెయిల్‌ 67 రోజుల తర్వాత జైలు నుంచి...

కరెంట్‌ కోతలు.. బిల్లులతో వాతలు

కరెంట్‌ కోతలు.. బిల్లులతో వాతలు రూ.5,420 కోట్ల భారం మోపే హక్కు ఎవరిచ్చారు కరెంట్‌...

బోగస్‌ ఫారం–7లపై కొరడా

బోగస్‌ ఫారం–7లపై కొరడా తప్పుడు దరఖాస్తులతో ఓట్ల తొలగింపునకు కుట్ర చేస్తే చర్యలు క్షుణ్ణంగా...

పరాయి పాలన వచ్చింది!

పరాయి పాలన వచ్చింది! ప్ర‌శ్నార్థ‌కంగా తెలంగాణ అస్తిత్వం తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు తరలిపోతున్నాయి ఉద్యోగాలు మనవే.....

పదవికో రేటు.. పనికో వాటా?

పదవికో రేటు.. పనికో వాటా? వ‌రంగ‌ల్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే ప‌నితీరుపై ఆరోప‌ణ‌లు బేర‌సారాల‌తోనే...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.