శంకరపట్నంలో కాంగ్రెస్ నిరసన ర్యాలీ
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు..
కాకతీయ,శంకరపట్నం: కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా శంకరపట్నం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి తిరుపతి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్, బసవయ్య గౌడ్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

