epaper
Saturday, October 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పట్టభద్రుల ఓటుతో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి

పట్టభద్రుల ఓటుతో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి
నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు
2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది.. జాబ్‌ క్యాలెండర్‌ ఏదీ?
గురుకులాల్లో వసతులు కల్పించలేని అసమర్థ పాలన
నవంబర్‌ 6లోగా ప్రతి గ్రాడ్యుయేట్‌ ఓటరుగా నమోదు కావాలి
ఖమ్మం–వరంగల్‌–నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌దే విజయం
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

కాకతీయ, మహబూబాబాద్ : రెండేళ్లలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. ఉద్యోగాల భర్తీ, జాబ్‌ క్యాలెండర్‌, నిరుద్యోగ భృతి వంటి హామీలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సరైన అవకాశమని అన్నారు. ఖమ్మం–వరంగల్‌–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, గ్రామగ్రామాన కాంగ్రెస్‌ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని డీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో నిర్వహించిన పట్టభద్రుల ఓటరు నమోదు సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్‌ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. ఓటరు నమోదు గడువు నవంబర్‌ 6తో ముగియనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. యువత, ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండేవారు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ తరఫున అత్యధిక సంఖ్యలో పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేసి బీఆర్ఎస్‌ బలాన్ని నిరూపించాలని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేందుకు ఈ ఎన్నికలను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు.

2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?

అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటివరకు ఆ హామీని నెరవేర్చలేదని ఎర్రబెల్లి విమర్శించారు. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులను రోడ్లపైకి తెచ్చారని మండిపడ్డారు. డిగ్రీ, అంతకంటే ఎక్కువ చదువుకున్న యువతకు ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులకు నెలకు రూ.4,000 భృతి ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. అశోక్‌నగర్‌లో నిరుద్యోగులను కలిసి ఉద్యోగాల కల్పనపై హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ ఇప్పుడు సమాధానం చెప్పాలని అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో గురుకులాలను ఏర్పాటు చేసిందని ఎర్రబెల్లి గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం గురుకులాల్లో కనీస వసతులు కల్పించడంలోనూ విఫలమైందని విమర్శించారు. పురుగుల అన్నం తిని విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నా సరైన పర్యవేక్షణ లేదని ఆరోపించారు. విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డులు ఇస్తామని చెప్పి స్కాలర్‌షిప్‌లు కూడా సకాలంలో అందించలేని పరిస్థితి నెలకొందన్నారు. గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేసిన విదేశీ విద్యా స్కాలర్‌షిప్‌లను నిలిపివేసి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని విమర్శించారు. విద్యార్థినులకు స్కూటీలు పంపిణీ చేస్తామన్న హామీని ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఉద్యోగులు, నిరుద్యోగులకు సమాధానం చెప్పాలి

ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, టీఏ, డీఏలు ఎందుకు ఇవ్వడం లేదో రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని ఎర్రబెల్లి డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ రంగంలో పనిచేసేవారు, చదువుకున్న నిరుద్యోగులు కాంగ్రెస్‌ పాలనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తూ, మరోవైపు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు చెందినట్లు పేర్కొంటున్న అంతర్జాతీయ పాఠశాలలపై దృష్టి పెట్టడం వెనుక ఉద్దేశమేంటో ప్రజలకు వివరించాలని ప్రశ్నించారు. ఖమ్మం–వరంగల్‌–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ అభ్యర్థి ఎవరైనా విజయం సాధించడం ఖాయమని ఎర్రబెల్లి దయాకర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామగ్రామాన పర్యటిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయడంతో పాటు, ఎన్నికల్లో బీఆర్ఎస్‌ అభ్యర్థి గెలుపు కోసం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్‌, రెడ్యా నాయక్‌, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌, మాజీ ఎంపీ మలోత్‌ కవిత, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

టీపీటీఎఫ్‌ ఇనుగుర్తి మండల నూతన కమిటీ

టీపీటీఎఫ్‌ ఇనుగుర్తి మండల నూతన కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కదిరే ప్రభాకర్‌,...

వ‌రంగ‌ల్‌ను ముక్క‌లు చేశారు

వ‌రంగ‌ల్‌ను ముక్క‌లు చేశారు జిల్లా విభజనతో పదేళ్లుగా ప్రజలకు తిప్పలు అశాస్త్రీయ నిర్ణయాలతో చారిత్రక...

ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి గొడ్డలిపెట్టు

ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి గొడ్డలిపెట్టు ఉద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం హామీలు అమలు...

సోమేశ్వరాల‌యం హుండీ ఆదాయం రూ.21.98 లక్షలు

సోమేశ్వరాల‌యం హుండీ ఆదాయం రూ.21.98 లక్షలు రూ.21,98,507 నగదు.. మిశ్రమ బంగారం, వెండి...

జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలి

జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలి పదేళ్ల జనగామ జిల్లా ప్రగతిని...

సాఫ్ట్ బాల్ ఆసోసియేషన్ సేవలు అభినందనీయం

సాఫ్ట్ బాల్ ఆసోసియేషన్ సేవలు అభినందనీయం : డాక్టర్ పావుశెట్టి శ్రీధర్ కాక‌తీయ‌,...

పల్లె సీను పుస్తకాల ఆవిష్కరణ మహోత్సవం

పల్లె సీను పుస్తకాల ఆవిష్కరణ మహోత్సవం సహస్ర చంద్ర దర్శన వేళ సాహిత్య...

మిల్క్‌ సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్‌ దాడి

మిల్క్‌ సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్‌ దాడి కాకతీయ, వరంగల్‌ బ్యూరో/వరంగల్ ప్రతినిధి : అనుమతులు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.