అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే
దుర్గామాత నవరాత్రుల సందర్భంగా మహిళలకు కోలల పంపిణీ
సాయి రూప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎద్దండి రాజు
కాకతీయ, వేములవాడ: దుర్గామాత ఆశీస్సులతో ప్రజలకు సేవ చేయడం, సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని సాయి రూప చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎద్దండి రాజు అన్నారు. దుర్గామాత నవరాత్రుల సందర్భంగా వేములవాడ పట్టణంలోని గాంధీనగర్ దుర్గామాత మండపం వద్ద ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కోలల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ నిర్వాహకుడు పిల్లి బాబురావు మాట్లాడుతూ మహిళా భక్తులకు కోలలు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా ఎన్నారై దాతలు తాడూరి లక్ష్మి, మహేష్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దాత తాడూరి మహేష్ మాట్లాడుతూ ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు తమ సహకారం కొనసాగుతుందని పేర్కొన్నారు. సమాజ హితం కోసం ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎద్దండి రాజు, సరళ, వేముల సతీష్, సంద్రగిరి రాజేష్ గౌడ్, గోంటి నవీన్, వాసాల హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

