ఎనుమాముల మార్కెట్కు 5 రోజులు సెలవులు
ఈ నెల 17 నుంచి 21 వరకు బంద్
22 నుంచి యథావిధిగా మార్కెట్ పునఃప్రారంభం
మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పులి ప్రియాంక ప్రకటన
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: దసరా పండుగ నేపథ్యంలో వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు 5 రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పులి ప్రియాంక తెలిపారు. ఈ నెల 17 నుంచి 21 వరకు మార్కెట్ బంద్ ఉంటుందని, తిరిగి 22వ తేదీ గురువారం నుంచి యథావిధిగా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ నెల 17న శనివారం యార్డులు బంద్ కాగా, 18న ఆదివారం వారాంతపు సెలవు, 19న సోమవారం మొహర్రం, 20న మంగళవారం విజయదశమి, 21న బుధవారం విజయదశమి మరుసటి రోజు సందర్భంగా సెలవులు ఉంటాయని వివరించారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సెలవు రోజుల్లో తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు తీసుకువచ్చి ఇబ్బందులు పడవద్దని పులి ప్రియాంక కోరారు. మార్కెట్ కమిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

