epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రాష్ట్రంలో విద్యుత్ సంక్షోంభం

రాష్ట్రంలో విద్యుత్ సంక్షోంభం
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే కారణం!
రైతుల పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదు
సింగరేణి బకాయిలు చెల్లించి బొగ్గు ఉత్పత్తి పెంచాలి
భూపాల‌ప‌ల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి

కాకతీయ, భూపాలపల్లి : రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సంక్షోభానికి ప్రభుత్వ ముందుచూపులేని నిర్ణయాలు, సరైన ప్రణాళిక లేకపోవడమే కారణమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి విమర్శించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించి, పంటలను కాపాడాలని ప్రభుత్వానికి చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. గురువారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్‌ కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మోటార్లు పనిచేయక సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 70 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గడానికి ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు కారణమయ్యాయనే అంశాన్ని సమీక్షించాలని గండ్ర డిమాండ్‌ చేశారు. జెన్‌కో, ట్రాన్స్‌కో, విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు, సింగరేణి మధ్య సుమారు రూ.60 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని, వీటి చెల్లింపుల్లో జాప్యం విద్యుత్‌ రంగంపై ప్రభావం చూపుతోందని ఆరోపించారు. ఓవర్‌బర్డెన్‌ టెండర్లలో రాజకీయ జోక్యం, అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు. చెల్పూర్‌ జెన్‌కో విద్యుత్‌ కేంద్రంలో సుమారు 1,100 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ, ప్రస్తుతం 400 నుంచి 600 మెగావాట్ల మేరకే ఉత్పత్తి జరుగుతోందని పేర్కొన్నారు. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు అవసరమైన బొగ్గును నిరంతరంగా సరఫరా చేయడంతోపాటు సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని సూచించారు.

రైతుల పంటలను కాపాడాలి
గతంలో కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో రైతులకు 24 గంటల విద్యుత్‌ సరఫరా అందేదని గండ్ర గుర్తుచేశారు. ప్రస్తుతం విద్యుత్‌ అంతరాయాలతో ఫ్యూజులు కాలిపోవడం, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడం, మోటార్లు పనిచేయకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. వరి పంటలకు కీలకమైన రాబోయే 15 రోజుల నుంచి నెల రోజుల వ్యవధిలో నిరంతర విద్యుత్‌ అందకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్‌ డిమాండ్‌, ఉత్పత్తి, లోటుపై గత మూడునాలుగేళ్ల గణాంకాలతో సమగ్ర విశ్లేషణ చేసి, ముందస్తు కార్యాచరణ రూపొందించాలని కోరారు. థర్మల్‌, సౌర విద్యుత్‌ ఉత్పత్తిని అంచనా వేస్తూ, అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్‌ కొనుగోలు చేయాలని సూచించారు. అధికారులను సస్పెండ్‌ చేయడం, వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదని స్పష్టం చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో దేవాదుల ఎత్తిపోతల పథకానికి సరిపడా విద్యుత్‌ అందక మోటార్లు పనిచేయడం లేదని, సాగునీటితోపాటు తాగునీటి అవసరాలపైనా ప్రభావం పడే ప్రమాదం ఉందని గండ్ర తెలిపారు. దేవాదులకు పూర్తిస్థాయిలో విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే వారి పక్షాన ఉద్యమించి, రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రజా సమస్యలను ప‌రిష్క‌రించాలి

ప్రజా సమస్యలను ప‌రిష్క‌రించాలి నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు! తాగునీటి సమస్యలపై తక్షణ చర్యలు...

పత్తికి రూ.9,200.. మొక్కజొన్నకు రూ.2,900

పత్తికి రూ.9,200.. మొక్కజొన్నకు రూ.2,900 ధరలు పెరగడంతో రైతుల హర్షం కాకతీయ, కేసముద్రం: కేసముద్రం...

ఏనుమాములలో ధరల మోసం.. ఇద్దరి లైసెన్సులు రద్దు!

ఏనుమాములలో ధరల మోసం.. ఇద్దరి లైసెన్సులు రద్దు! 190 బస్తాల మిర్చి ధరలో...

పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి శాంతిభద్రతల పరిరక్షణకు...

పి ఆర్ టి యు రాష్ట్ర శాఖ ఎన్నికల్లో మండల సభ్యులకు చోటు

పి ఆర్ టి యు రాష్ట్ర శాఖ ఎన్నికల్లో మండల సభ్యులకు...

జీడబ్ల్యూఎంసీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటిన వేడుకలు

జీడబ్ల్యూఎంసీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటిన వేడుకలు పూల సోయగాలతో ముస్తాబైన ప్రాంగణం...

మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ పేద, నిరుద్యోగ మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం జాతీయ ఎస్టీ...

బతుకమ్మ సంబరాల్లో ములుగు కలెక్టరేట్‌

బతుకమ్మ సంబరాల్లో ములుగు కలెక్టరేట్‌ మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.