epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అధికారికంగా ఒకచోట.. ఆచరణలో మరో చోట

అధికారికంగా ఒకచోట.. ఆచరణలో మరో చోట

– గ్రామీణ వైద్యానికి తూట్లు పొడుస్తున్న వైనం
– సన్నూరు ఆసుపత్రి రాయపర్తికి తరలింపు
– సౌకర్యాల లేమా? అధికారుల సౌలభ్యమా?
– రోగుల కష్టాలకు బాధ్యులెవరు?
– ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని సన్నూరు ప్రజల డిమాండ్

కాకతీయ,రాయపర్తి : గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా ఆయుర్వేద సాంప్రదాయ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ప్రభుత్వ ఆశయం అధికారుల అలసత్వంతో నీరుగారుతోంది.జాతీయ ఆయుష్ మిషన్(నామ్)కింద సన్నూరు గ్రామానికి మంజూరైన ప్రభుత్వ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అక్కడి నిరుపేదల ఆరోగ్య అవసరాలు తీర్చాలి.కానీ…నిబంధనలకు విరుద్ధంగా రాయపర్తి మండల కేంద్రంలో వైద్య సేవలు కొనసాగుతుండటంపై సన్నూరు గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి,ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రికార్డుల ప్రకారం ఒకచోట మంజూరైన ఆసుపత్రి,ఆచరణలో మాత్రం మరోచోట నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు.ఆసుపత్రి భవనం గోడపై గ్రామం:సన్నూరు,మండలం:రాయపర్తి అని స్పష్టంగా రాసి ఉన్నప్పటికీ,సేవలు మాత్రం మండల కేంద్రానికి పరిమితం కావడం అధికారుల బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది.ఈ క్రమంలో సన్నూరు గ్రామస్తులు,ముఖ్యంగా నిరుపేద రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

* ప్రజా ప్రయోజనాలు పక్కదారి?

సాధారణంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు,ముఖ్యంగా నిరుపేదలకు ప్రాథమిక స్థాయిలోనే ప్రత్యామ్నాయ వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం నిర్దిష్ట గ్రామాలను ఎంపిక చేసి హెల్త్ సెంటర్లను మంజూరు చేస్తుంది.ఈ నేపథ్యంలోనే సన్నూరు గ్రామానికి ఈ ఆయుర్వేద వైద్యశాల కేటాయించబడింది.ఇదిలా ఉండగా… సన్నూరు ప్రజలకు అందించాల్సిన వైద్య ఫలాలను ఎవరి వెసులుబాటు కోసం,ఏ కారణాలతో మండల కేంద్రానికి తరలించారనే దానిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.అధికారులు తమ రోజూవారీ రాకపోకల సౌలభ్యం కోసమే ఆస్పత్రిని ఏకంగా రాయపర్తికి తరలించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

* మందుల కోసం మండలానికి పరుగు..

సన్నూరు గ్రామానికి చెందిన వృద్ధులు,కూలీలకు తిప్పలు తప్పడం లేదు.చిన్నపాటి కీళ్ల నొప్పులు,జ్వరం, దీర్ఘకాలిక సమస్యల కోసం ఆయుర్వేద మందులు పొందాలంటే మండల కేంద్రానికి పరిగెత్తాల్సి వస్తుందని కంటతడి పెడుతున్నారు.తీరా ఆస్పత్రికి వెళ్లేసరికి మేడం లీవ్ లో ఉన్నారు అంటూ… సిబ్బంది సమాధానం చెప్పడం నిత్యకృత్యంగా మారిందని రోగులు ఆరోపిస్తున్నారు.అనారోగ్యంతో బాధపడుతూ,కూలి పనులు మానేసి,ఆటో చార్జీలు భరించి ఆసుపత్రికి వెళ్లేసరికి వైద్యులు గైర్వాజరు కావడంతో ఖాళీ చేతులతో వెనదురగాల్సి వస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వైద్యులు ఎప్పుడు ఉంటారో,ఎప్పుడు లీవ్ లో ఉంటారో తెలియక అయోమయానికి గురవుతున్నామని,అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని స్థానికులు మండిపడుతున్నారు.

* ఆయుష్ వైద్యాధికారి గజవెల్లి ఉషారాణిని వివరణ కోరగా..

సన్నూరు గ్రామంలో ఆసుపత్రి నిర్వహణకు సరిపడా సౌకర్యాలు ఉన్నా..సొంత భవనం లేకపోవడం వల్లే తాత్కాలికంగా రాయపర్తి కేంద్రానికి తరలించామన్నారు.గ్రామంలో భవనం లేదా స్థలం అందుబాటులోకి వచ్చిన వెంటనే ఆసుపత్రిని తిరిగి సన్నూరు గ్రామానికి తరలిస్తామని ఆమె తెలిపారు.

* ఉన్నతాధికారులు స్పందించాలి… సన్నూరుకే ఆసుపత్రిని పునరుద్ధరించాలి

అధికారుల నిర్లక్ష్యంతో నిరుపేదలకు అందాల్సిన వైద్య ఫలాలు పక్క దారి పడుతున్నాయని,ఇప్పటికైనా జిల్లా కలెక్టర్,ఆయుష్ శాఖ జిల్లా ఉన్నతాధికారులు స్పందించి దీనిపై సమగ్ర విచారణ జరిపించాలి.తక్షణమే సన్నూరు గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను పునరుద్ధరించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రజా సమస్యలను ప‌రిష్క‌రించాలి

ప్రజా సమస్యలను ప‌రిష్క‌రించాలి నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు! తాగునీటి సమస్యలపై తక్షణ చర్యలు...

పత్తికి రూ.9,200.. మొక్కజొన్నకు రూ.2,900

పత్తికి రూ.9,200.. మొక్కజొన్నకు రూ.2,900 ధరలు పెరగడంతో రైతుల హర్షం కాకతీయ, కేసముద్రం: కేసముద్రం...

ఏనుమాములలో ధరల మోసం.. ఇద్దరి లైసెన్సులు రద్దు!

ఏనుమాములలో ధరల మోసం.. ఇద్దరి లైసెన్సులు రద్దు! 190 బస్తాల మిర్చి ధరలో...

పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి శాంతిభద్రతల పరిరక్షణకు...

పి ఆర్ టి యు రాష్ట్ర శాఖ ఎన్నికల్లో మండల సభ్యులకు చోటు

పి ఆర్ టి యు రాష్ట్ర శాఖ ఎన్నికల్లో మండల సభ్యులకు...

జీడబ్ల్యూఎంసీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటిన వేడుకలు

జీడబ్ల్యూఎంసీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటిన వేడుకలు పూల సోయగాలతో ముస్తాబైన ప్రాంగణం...

మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ పేద, నిరుద్యోగ మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం జాతీయ ఎస్టీ...

బతుకమ్మ సంబరాల్లో ములుగు కలెక్టరేట్‌

బతుకమ్మ సంబరాల్లో ములుగు కలెక్టరేట్‌ మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.