epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రైతులకు మద్దతుగా ఈనెల 23న కలెక్టరేట్ ముందు బిజెపి ధర్నా

రైతులకు మద్దతుగా ఈనెల 23న కలెక్టరేట్ ముందు బిజెపి ధర్నా
రైతుల సమస్యల పరిష్కారానికి పోరాటం
ధర్నాలో రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి
గంగాడి కృష్ణారెడ్డి

కాకతీయ,శంకరపట్నం: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. శనివారం శంకరపట్నం మండల కేంద్రంలోని మాధవసాయి గార్డెన్స్‌లో బీజేపీ మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ అధ్యక్షతన నిర్వహించిన మండల కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. విద్యుత్ కొరత, సాగునీటి సమస్యలతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. రైతులకు జరుగుతున్న నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
రైతుల సమస్యలపై బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 23న కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాలో శంకరపట్నం మండలం నుంచి రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు కొమురయ్య, సర్పంచ్ వెన్నేం మల్లేష్, నాయకులు దొంగల రాములు, జంగ జైపాల్, రామిడి ఆదిరెడ్డి, రాసమల్ల శ్రీనివాస్, మందాడి జగ్గారెడ్డి, కనకం సాగర్, బిజిలి సారయ్య, చెర్ల శ్రీనివాస్‌తో పాటు వివిధ మోర్చాల మండల అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్‌చార్జీలు, బూత్ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అక్రమ పేలుడు పదార్థాలు స్వాధీనం

అక్రమ పేలుడు పదార్థాలు స్వాధీనం 475 జిలెటిన్‌ స్టిక్స్‌, 3,000 మీటర్ల డిటోనేటింగ్‌...

కోత దశలోనైనా నీటిని విడుదల చేయండి!

కోత దశలోనైనా నీటిని విడుదల చేయండి! పంటలు ఎండిపోతున్నా పట్టించుకోరా? ఎల్ఎండీ నుంచి సాగునీటి...

జోగాపూర్‌లో దొంగల చేతివాటం!

జోగాపూర్‌లో దొంగల చేతివాటం! అర్ధరాత్రి భారీ చోరీ.. రూ.80 వేల నగదు సహా...

మల్యాల, లింగంపేటలో దుర్గమ్మకు చల్మెడ ప్రత్యేక పూజలు!

మల్యాల, లింగంపేటలో దుర్గమ్మకు చల్మెడ ప్రత్యేక పూజలు! అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో...

విద్యుత్ కోతలపై భగ్గుమన్న బీఆర్ఎస్

విద్యుత్ కోతలపై భగ్గుమన్న బీఆర్ఎస్ వేములవాడ సబ్‌స్టేషన్‌ ఎదుట రైతులతో కలిసి మహా...

కరీంపేటలో దొంగల బీభత్సం..

కరీంపేటలో దొంగల బీభత్సం.. రైతుల మోటార్లు మాయం! ఒకే రాత్రి ముగ్గురు రైతులకు...

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి!

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి! ఈనెల 23న కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలి బీజేపీ...

వేములవాడలో సద్దుల బతుకమ్మ సంబరాలు!

వేములవాడలో సద్దుల బతుకమ్మ సంబరాలు! పూల పండుగలో ఆడపడుచుల ఆటపాటలు కోలాటం ఆడి.. డోలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.