ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎదల్ల యాదవ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డా.భూక్యా మురళి నాయక్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా భారీ కేక కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం మండల అధ్యక్షులు యాదవ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న ఎమ్మెల్యేకు మండల ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎదల్ల యాదవ రెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు,
పార్టీ నాయకులు వెంకన్న ప్రశాంత్, భాస్కర్, ప్రభాకర్ గౌడ్, బాలాజీ నాయక్, గుట్టయ్య, వెంకన్న, సతీష్, నాగరాజు, యాకయ్య, కృష్ణ, రాజేష్, పూర్ణచందర్, వెంకటేష్, మధు, శ్రీను, యాకన్న,
దేవేందర్, ప్రశాంత్, వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు,
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

