epaper
Tuesday, October 6, 2026
epaper
BREAKING NEWS
Loading News...

భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట భద్రత..

భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట భద్రత..

జాతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ నగరంలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతా, ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. ఉత్సవాల నేపథ్యంలో మంగళవారం ఆమె ఆలయాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకుంటున్న చర్యలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ పరిసరాలు, భక్తుల క్యూలైన్లు, పార్కింగ్ ప్రదేశాలు, భద్రతా విభాగాలను సీపీ క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఉత్సవాల సమయంలో ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, భక్తుల రాకపోకలు సజావుగా జరిగేలా సమన్వయంతో విధులు నిర్వహించాలని పోలీసు అధికారులకు సూచించారు. భక్తులకు భద్రతతో పాటు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, అడిషనల్ డీసీపీ (అడ్మినిస్ట్రేషన్) రాయల ప్రభాకర్ రావు, హన్మకొండ ఏసీపీ నర్సింహారావు, ట్రాఫిక్ ఏసీపీ టి. సత్యనారాయణ, మట్టెవాడ, ఇంతేజర్‌గంజ్, మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్లు, ఆలయ పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖాతాదారుల బంగారంతో బెట్టింగ్‌

ఖాతాదారుల బంగారంతో బెట్టింగ్‌ బ్యాంకుకు తెలియకుండా మరో సంస్థలో తనఖా.. అసిస్టెంట్‌ మేనేజర్‌...

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో...

ఏజెన్సీకి న్యాయ సేవలు విస్తరించాలి

ఏజెన్సీకి న్యాయ సేవలు విస్తరించాలి ఏటూరునాగారంలో అదనపు జేఎఫ్‌సీఎం కోర్టు ఏర్పాటు చేయాలంటున్న...

నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి మహాజ్యోతి పూజ

నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి మహాజ్యోతి పూజ కాకతీయ, గీసుగొండ: ప్రసిద్ధ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి...

బతుకమ్మ, దసరా వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి

బతుకమ్మ, దసరా వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ వరంగల్...

ఎస్ఐ, పీసీ ఉద్యోగాలకు ఉచిత రెసిడెన్షియల్‌ కోచింగ్‌

ఎస్ఐ, పీసీ ఉద్యోగాలకు ఉచిత రెసిడెన్షియల్‌ కోచింగ్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ...

బాహ్య మూల్యాంకనం సరికొత్త విధానం

బాహ్య మూల్యాంకనం సరికొత్త విధానం ఆరు, తొమ్మిదో తరగతి జవాబు పత్రాల పరిశీలన నిర్ణీత...

రైస్‌మిల్లుకు అనుమతులు రద్దు చేయాలి

రైస్‌మిల్లుకు అనుమతులు రద్దు చేయాలి ఇళ్లకు ఆనుకుని మిల్లు నిర్మించొద్దంటూ గ్రామస్తుల ధర్నా కాలుష్యం,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.