పేద విద్యార్థులకు పబ్లిక్ స్కూల్ ఒక వరం
కాంగ్రెస్ తోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యం
* పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
కాకతీయ,ఆత్మకూరు : పేద మధ్యతరగతి విద్యార్థులకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒక వరం అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ పనులకు అయన శంకుస్థాపన చేసి మాట్లాడారు పేద మధ్యతరగతి పిల్లకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ కృషి చేస్తుందని అన్నారు. కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యను విద్యార్థులకు ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ వ్యవస్థను ప్రజా ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు.విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు, నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు.తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ద్వారా పేద విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యా అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్దాపూర్ సర్పంచ్ ఎలుకటి రవి,కాంగ్రెస్ జిల్లా నాయకులు కమలాపురం రమేష్,మండల అధ్యక్షుడు రేవూరి జెలందెర్ రెడ్డి,పరికిరాల వాసు,అక్కంపేట సర్పంచ్ ముద్దం సాంబయ్య,చౌళ్లపల్లి మాజీ సర్పంచ్ కంచె రవి కుమార్,రేవూరి జైపాల్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.


