కొత్త రేషన్ కార్డులతో పేదలకు భరోసా
పేదవాడి ఆకలి తీరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
పరకాల 19వ వార్డు కౌన్సిలర్ కొయ్యడ శ్రీనివాస్
కాకతీయ, పరకాల : పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తోందని 19వ వార్డు కౌన్సిలర్, మాజీ పరకాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ అన్నారు. పరకాల పట్టణంలోని 19వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ, రేషన్ కార్డుల డిజిటల్ కార్డుల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో లక్షలాది నూతన రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు పేదలకు సన్నబియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని, కార్డుల్లో పిల్లల పేర్లను కూడా నమోదు చేయలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేదలకు కూడు, గుడ్డ, నీడ కల్పించడమే లక్ష్యంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు సొంతింటి కల నెరవేర్చడంతో పాటు సన్నబియ్యంతో వారి కడుపు నింపుతున్నారని అన్నారు. కార్యక్రమంలో 16వ వార్డు కౌన్సిలర్ బండి శ్రీధర్, సురేష్, షఫీ, రాహుల్, ప్రజలు పాల్గొన్నారు.

