మానాల ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు
కాకతీయ, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సాయంత్రం ముందస్తు బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పూలతో ఆకర్షణీయంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ వస్త్రధారణలో బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు. పాఠశాల ప్రాంగణం చిన్నారుల సందడితో పండుగ వాతావరణాన్ని తలపించింది. గ్రామ సర్పంచ్ బుర్ర శంకర్ పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుర్ర శంకర్,విడిసి వైస్ చైర్మన్ చెదలు నవీన్, ఉపాధ్యాయులు,శ్రీధర్, నవీన్,హనుమండ్లు, స్వప్న, వెంకట లక్ష్మి, మానస, గౌతమి, వాణి, ప్రియాంక, మంజులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

