epaper
Saturday, October 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వ‌రంగ‌ల్‌ను ముక్క‌లు చేశారు

వ‌రంగ‌ల్‌ను ముక్క‌లు చేశారు
జిల్లా విభజనతో పదేళ్లుగా ప్రజలకు తిప్పలు
అశాస్త్రీయ నిర్ణయాలతో చారిత్రక నగర అస్తిత్వానికి దెబ్బ
ఒకే నగరానికి రెండు జిల్లాల పాలనతో ప్రజలకు ఇబ్బందులు
డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి ధ్వ‌జం

కాకతీయ, వరంగల్‌ బ్యూరో: ఉమ్మడి వరంగల్‌ జిల్లాను శాస్త్రీయ ప్రణాళిక లేకుండా విభజించి పదేళ్లు పూర్తయినా ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదని హనుమకొండ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి విమర్శించారు. పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో గత బీఆర్ఎస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వరంగల్‌ చారిత్రక అస్తిత్వాన్ని దెబ్బతీశాయని మండిపడ్డారు. జిల్లా విభజనకు పదేళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ, ప్రజా సంఘాలు నగరంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశాయి. వరంగల్‌, హనుమకొండ ప్రాంతాలకు ఒకే సంస్కృతి, చారిత్రక వారసత్వం ఉన్నప్పటికీ వేర్వేరు జిల్లాలుగా విభజించడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇనగాల అన్నారు. రేషన్‌ కార్డులు, రెవెన్యూ రికార్డులు, భూముల రిజిస్ట్రేషన్లు, కుల ధ్రువీకరణ పత్రాల కోసం ఏ జిల్లా కార్యాలయాన్ని సంప్రదించాలో తెలియక అయోమయానికి గురవుతున్నారని పేర్కొన్నారు. కొత్త జిల్లాలకు అవసరమైన మౌలిక వసతులు, కార్యాలయ భవనాలు సకాలంలో ఏర్పాటు చేయకపోవడంతో సమస్యలు పెరిగాయని విమర్శించారు.

జయశంకర్‌ సార్‌ పేరు విషయంలోనూ తప్పిదం

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ జన్మస్థలం ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామమని, ఆయనకు వరంగల్‌ ప్రాంతంతో విడదీయలేని అనుబంధం ఉందని ఇనగాల గుర్తుచేశారు. అలాంటి మహనీయుడి పేరు భూపాలపల్లి జిల్లాకు పెట్టే విషయంలో గత ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరించిందని విమర్శించారు. మహనీయుల పేర్లను జిల్లాలకు పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే వారి జన్మస్థలం, జీవిత అనుబంధం ఉన్న ప్రాంతాల చారిత్రక ప్రాధాన్యాన్ని విస్మరించరాదని అన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాను ఆరు జిల్లాలుగా విభజించడం, అనంతరం ఉద్యోగుల సర్దుబాటు, స్థానికతకు సంబంధించిన సమస్యలతో యువతకు నష్టం జరిగిందని ఇనగాల ఆరోపించారు. పారిశ్రామిక రంగంలో ఆశించిన స్థాయిలో పరిశ్రమలు రాకపోవడంతో నిరుద్యోగ సమస్య కొనసాగుతోందన్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో గత ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపలేదని విమర్శించారు.

సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంలో జాప్యం

వరంగల్‌ సెంట్రల్‌ జైలును తొలగించి 24 అంతస్తులు, 2,000 పడకలతో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని గత బీఆర్ఎస్‌ ప్రభుత్వం ప్రకటించినా పనులు పూర్తి చేయడంలో జాప్యం జరిగిందని ఇనగాల విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టారని తెలిపారు. నిధులు, అధునాతన వైద్య పరికరాలు, సిబ్బందిని అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో మిగిలిన వాటిని పూర్తి చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఇనగాల ఆరోపించారు. ప్రజలకు పాలనను చేరువ చేయడంతో పాటు పరిపాలనా సమస్యలను పరిష్కరించి వరంగల్‌ సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నగర చారిత్రక ప్రాధాన్యాన్ని, ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రజా సంఘాలతో కలిసి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డితో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి కాంగ్రెస్‌ నాయకులు, వివిధ సంస్థల చైర్మన్లు, కుడా చైర్మన్‌, పీసీసీ సభ్యులు, జిల్లా కమిటీ ప్రతినిధులు, డివిజన్‌, మండల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

టీపీటీఎఫ్‌ ఇనుగుర్తి మండల నూతన కమిటీ

టీపీటీఎఫ్‌ ఇనుగుర్తి మండల నూతన కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కదిరే ప్రభాకర్‌,...

ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి గొడ్డలిపెట్టు

ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి గొడ్డలిపెట్టు ఉద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం హామీలు అమలు...

సోమేశ్వరాల‌యం హుండీ ఆదాయం రూ.21.98 లక్షలు

సోమేశ్వరాల‌యం హుండీ ఆదాయం రూ.21.98 లక్షలు రూ.21,98,507 నగదు.. మిశ్రమ బంగారం, వెండి...

జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలి

జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలి పదేళ్ల జనగామ జిల్లా ప్రగతిని...

సాఫ్ట్ బాల్ ఆసోసియేషన్ సేవలు అభినందనీయం

సాఫ్ట్ బాల్ ఆసోసియేషన్ సేవలు అభినందనీయం : డాక్టర్ పావుశెట్టి శ్రీధర్ కాక‌తీయ‌,...

పట్టభద్రుల ఓటుతో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి

పట్టభద్రుల ఓటుతో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వానికి గుణపాఠం...

పల్లె సీను పుస్తకాల ఆవిష్కరణ మహోత్సవం

పల్లె సీను పుస్తకాల ఆవిష్కరణ మహోత్సవం సహస్ర చంద్ర దర్శన వేళ సాహిత్య...

మిల్క్‌ సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్‌ దాడి

మిల్క్‌ సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్‌ దాడి కాకతీయ, వరంగల్‌ బ్యూరో/వరంగల్ ప్రతినిధి : అనుమతులు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.