epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. విద్యుత్‌ వినియోగం డబుల్‌!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. విద్యుత్‌ వినియోగం డబుల్‌!
భూపాలపల్లి సర్కిల్‌లో పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌
ట్రాన్స్‌ఫార్మర్లపై అధిక భారం.. నిరంతర సరఫరాకు ప్రత్యేక చర్యలు
టీజీఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ ఎన్‌.సదానందం వెల్లడి

కాకతీయ, భూపాలపల్లి : ఎల్‌నినో వాతావరణ పరిస్థితులు, లోటు వర్షపాతం, సుదీర్ఘ ఎండలతో విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగిందని టీజీఎన్‌పీడీసీఎల్‌ భూపాలపల్లి సర్కిల్‌ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ ఎన్‌.సదానందం తెలిపారు. వ్యవసాయ మోటార్ల వినియోగంతో పాటు ఇళ్లలో ఏసీలు, కూలర్ల వాడకం పెరగడంతో విద్యుత్‌ పంపిణీ వ్యవస్థపై అదనపు భారం పడుతోందన్నారు. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా నిరంతర విద్యుత్‌ సరఫరా అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు అక్టోబర్‌ 13న విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. 2025తో పోలిస్తే 2026లో విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరిగిందని ఎస్‌ఈ వివరించారు. జూలై, ఆగస్టు నెలల్లో వినియోగం 33 శాతం పెరగగా, సెప్టెంబరులో 91 శాతం పెరుగుదల నమోదైనట్లు తెలిపారు. అక్టోబర్‌ 1 నుంచి 12 వరకు 26 శాతం పెరుగుదల ఉన్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబరులో గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ 222.88 మెగావాట్లకు చేరిందన్నారు. అక్టోబర్‌లో రోజువారీ వినియోగం 2025లో 18.72 మిలియన్‌ యూనిట్లుగా ఉండగా, 2026లో 39.10 మిలియన్‌ యూనిట్లకు పెరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. భూగర్భ జలమట్టాలు తగ్గడంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు మోటార్లను ఎక్కువసేపు నడుపుతున్నారని, అధిక ఉష్ణోగ్రతలతో గృహ, వాణిజ్య అవసరాలకు విద్యుత్‌ వినియోగం పెరిగిందని తెలిపారు. వ్యవసాయ ఫీడర్లకు మూడు ఫేజుల సరఫరా అందించే సమయంలో మోటార్లు ఒకేసారి ప్రారంభం కావడం వల్ల ట్రాన్స్‌ఫార్మర్లపై అదనపు ఒత్తిడి ఏర్పడుతోందన్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ట్రాన్స్‌ఫార్మర్లలో సాంకేతిక వైఫల్యాలు సంభవించే అవకాశాలు పెరుగుతున్నాయని వివరించారు.

ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులకు ప్రత్యేక బృందాలు

విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలను తగ్గించేందుకు డివిజన్‌, సర్కిల్‌, కార్పొరేట్‌ కార్యాలయాల్లో 24 గంటల కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఈ తెలిపారు. ప్రత్యేక అధికారులు, నోడల్‌ అధికారులను నియమించి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టినట్లు పేర్కొన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు, మార్పిడి, సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం చేశామని, జిల్లా కేంద్రాల్లో మొబైల్‌ ట్రాన్స్‌ఫార్మర్లను సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఫిర్యాదుల కోసం ట్రాన్స్‌ఫార్మర్లపై టోల్‌ఫ్రీ నంబర్‌ 1912ను ముద్రించినట్లు వివరించారు. డిసెంబర్‌ 2023 నుంచి సెప్టెంబర్‌ 2026 వరకు మూడు కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్లు, 97.2 కిలోమీటర్ల 33 కేవీ లైన్లు, 457 కిలోమీటర్ల 11 కేవీ లైన్లు, 825 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, ఏడు పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. మంజూరైన ఆరు కొత్త సబ్‌స్టేషన్లలో మూడు అందుబాటులోకి రాగా, మరో రెండు చార్జింగ్‌కు సిద్ధంగా ఉన్నాయని, ఒక సబ్‌స్టేషన్‌ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఎనిమిది ఇంటర్‌లింకింగ్‌ లైన్లలో 80 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని వివరించారు. విద్యుత్‌ నష్టాలను తగ్గించేందుకు సబ్‌స్టేషన్లు, ఫీడర్లపై కెపాసిటర్‌ బ్యాంకులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వచ్చే వేసవిలో పెరగనున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆరు సబ్‌స్టేషన్లు, ఏడు పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, ఆరు కొత్త 33 కేవీ ఫీడర్లు, 122 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, 600 కేవీఏ సామర్థ్యంతో 100 కెపాసిటర్‌ బ్యాంకుల ఏర్పాటు లక్ష్యంగా 2027 వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు ఎస్‌ఈ తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రజా సమస్యలను ప‌రిష్క‌రించాలి

ప్రజా సమస్యలను ప‌రిష్క‌రించాలి నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు! తాగునీటి సమస్యలపై తక్షణ చర్యలు...

పత్తికి రూ.9,200.. మొక్కజొన్నకు రూ.2,900

పత్తికి రూ.9,200.. మొక్కజొన్నకు రూ.2,900 ధరలు పెరగడంతో రైతుల హర్షం కాకతీయ, కేసముద్రం: కేసముద్రం...

ఏనుమాములలో ధరల మోసం.. ఇద్దరి లైసెన్సులు రద్దు!

ఏనుమాములలో ధరల మోసం.. ఇద్దరి లైసెన్సులు రద్దు! 190 బస్తాల మిర్చి ధరలో...

పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి శాంతిభద్రతల పరిరక్షణకు...

పి ఆర్ టి యు రాష్ట్ర శాఖ ఎన్నికల్లో మండల సభ్యులకు చోటు

పి ఆర్ టి యు రాష్ట్ర శాఖ ఎన్నికల్లో మండల సభ్యులకు...

జీడబ్ల్యూఎంసీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటిన వేడుకలు

జీడబ్ల్యూఎంసీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటిన వేడుకలు పూల సోయగాలతో ముస్తాబైన ప్రాంగణం...

మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ పేద, నిరుద్యోగ మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం జాతీయ ఎస్టీ...

బతుకమ్మ సంబరాల్లో ములుగు కలెక్టరేట్‌

బతుకమ్మ సంబరాల్లో ములుగు కలెక్టరేట్‌ మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.