కుటుంబ కలహాలతో వ్యక్తి బలవన్మరణం
కాకతీయ, రాయపర్తి: కుటుంబంలో తలెత్తిన విభేదాలతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివరాంపురం గ్రామానికి చెందిన కుక్కల ప్రశాంత్ (25)కు కాట్రపల్లి గ్రామానికి చెందిన వేల్పుగొండ రాధికతో 4 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమార్తె ఉండగా, ప్రస్తుతం రాధిక 5 నెలల గర్భవతి. గత 3 నెలలుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి కాపురానికి రాకపోవడంతో ప్రశాంత్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ప్రశాంత్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి తల్లి కుక్కల కాంత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ముత్యం రాజేందర్ వెల్లడించారు.
కుటుంబ కలహాలతో వ్యక్తి బలవన్మరణం
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్ను ఫాలోకండి

