epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మెడిక‌వ‌ర్ మాట మార్చింది

మెడిక‌వ‌ర్ మాట మార్చింది
మిస్ట‌రీగా న్యాయ‌వాది ఐశ్వ‌ర్య మృతి
2 ఎంఎం స్టోన్‌ అన్నారు.. రిపోర్టులో 16 ఎంఎం చూపించారు!
వైద్య నివేదికల్లో పరస్పర విరుద్ధ వివరాలు
నడుచుకుంటూ వచ్చిన ఐశ్వర్యకు ఈ దుస్థితి ఏమిటి?
ఆపరేషన్‌ రిపోర్టుల కోసం అడిగితే ప్రింటర్‌ లేదంటున్నారు
రూ.8 లక్షలు ఖర్చయినా.. ఇంకా డబ్బులు కట్టాలంటున్నారు
ఆసుపత్రి యాజమాన్యం బాధ్యత వహించాలి
ఐశ్వర్య కుటుంబ సభ్యులు, సహచర న్యాయవాదుల ఆవేదన

కాకతీయ, తెలంగాణ బ్యూరో : కిడ్నీలో 2 ఎంఎం రాయి ఉందని చెప్పి ఆసుపత్రికి తీసుకొస్తే, వైద్య నివేదికల్లో 16 ఎంఎం స్టోన్‌ ఉన్నట్లు చూపించడమేంటని న్యాయవాది ఐశ్వర్య కుటుంబ సభ్యులు, సహచర న్యాయవాదులు ప్రశ్నించారు. నడుచుకుంటూ ఆసుపత్రికి వచ్చిన 26 ఏళ్ల యువతి పది రోజుల వ్యవధిలోనే బ్రెయిన్‌ డెడ్‌ స్థితికి చేరడం వెనుక ఏం జరిగిందో తేల్చాలని డిమాండ్‌ చేశారు. చికిత్సకు సంబంధించిన పూర్తి వైద్య రికార్డులు అందించాలని, ఐశ్వర్య మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. హైదరాబాద్‌లోని మెడికవర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఐశ్వర్య మృతి చెందడంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 6న కిడ్నీలో రాళ్ల సమస్యతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించామని, మరుసటి రోజే ఇంటికి పంపిస్తామని వైద్యులు చెప్పారని ఐశ్వర్య మేనమామ వివరించారు. అయితే, ఆ తర్వాత ఆమెను ఐసీయూకు తరలించారని, శరీరమంతా ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించిందని చెబుతూ చికిత్స కొనసాగించారని తెలిపారు. రోగి పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించినా లోపలికి అనుమతించలేదని ఆరోపించారు.

 

 

వైద్య నివేదికల్లో తేడాలేంటి?

కిడ్నీలో తొలుత 2 ఎంఎం రాయి ఉందని చెప్పారని, ఆ తర్వాత 20 ఎంఎం అని పేర్కొన్నారని, చివరకు వైద్య నివేదికల్లో 16 ఎంఎం స్టోన్‌ చూపించారని ఐశ్వర్య సహచర న్యాయవాది ఆరోపించారు. ఈ వివరాల్లో తేడాలు ఎందుకు వచ్చాయో ఆసుపత్రి యాజమాన్యం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆపరేషన్‌కు సంబంధించిన నివేదికలు, ఇతర వైద్య పత్రాల కోసం అడిగితే ప్రింటర్‌ లేదని చెబుతున్నారని, పత్రాల ప్రతులు ఇవ్వకుండా ఆన్‌లైన్‌లో చూసుకోవాలని సూచిస్తున్నారని విమర్శించారు. పెద్ద కార్పొరేట్‌ ఆసుపత్రిలో ప్రింటర్‌ లేదని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఐశ్వర్యకు నిర్వహించిన చికిత్స, ఆపరేషన్‌ వివరాలు, ఐసీయూలో ఉంచిన తీరు, చేతులు, కాళ్లకు బ్యాండేజీలు కట్టిన విధానంపై కూడా సందేహాలు వ్యక్తం చేశారు. వైద్య రికార్డులన్నీ అందుబాటులోకి వస్తేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.

రూ.8 లక్షలు ఖర్చు.. ఇంకా బిల్లు కట్టాలంటున్నారు

ఐశ్వర్య చికిత్స కోసం ఇప్పటికే సుమారు రూ.8 లక్షలు ఖర్చు చేశామని, అయినా ఇంకా డబ్బులు చెల్లించాలని ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారని ఆమె మేనమామ ఆవేదన వ్యక్తం చేశారు. రూ.3 లక్షలు, రూ.4 లక్షలు వసూలు చేసిన తర్వాత కూడా మరో రూ.9 లక్షలు బిల్లు ఉందని అడిగారని సహచర న్యాయవాది ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఆసుపత్రి వివరణ అందుబాటులో లేదు. ఐశ్వర్య తండ్రి కూడా న్యాయవాదేనని, ఆమె సికింద్రాబాద్‌ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. పెళ్లయిన 48 రోజులకే ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం తట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఐశ్వర్య శరీరం నీలం రంగులోకి మారిపోయిందని కుటుంబ సభ్యులు పేర్కొంటూ, చికిత్సలో ఏం జరిగిందో స్పష్టంగా వెల్లడించాలని కోరారు. వైద్యపరమైన తప్పిదం జరిగితే కేవలం క్షమాపణ చెప్పి సరిపెట్టుకోవడం సరికాదని డాక్టర్‌ ప్రదీప్‌ మిశ్రా వ్యాఖ్యానించినట్లు న్యాయవాది తెలిపారు.

ఆసుపత్రి ఎదుట భారీగా పోలీసుల మోహరింపు

ఐశ్వర్య మృతిపై కుటుంబ సభ్యులు, న్యాయవాదులు ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో మెడికవర్‌ ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆసుపత్రి బయట, లోపల పెద్ద సంఖ్యలో పోలీసులు ఉండటంపై న్యాయవాదులు ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఐశ్వర్య మరణానికి దారితీసిన పరిస్థితులు, చికిత్సలో అనుసరించిన విధానం, వైద్య నివేదికల్లో ఉన్నట్లు చెబుతున్న తేడాలు, బిల్లుల వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలపై ఆసుపత్రి యాజమాన్యం స్పందన వెలువడలేదు. పూర్తి వైద్య రికార్డులను పరిశీలించి, వాస్తవాలను నిర్ధారించిన తర్వాతే బాధ్యత, వైద్యపరమైన నిర్లక్ష్యం వంటి అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నర్సంపేట పగ్గాలు.. స్వప్నకే!

నర్సంపేట పగ్గాలు.. స్వప్నకే! పెద్ది కుటుంబానికే బీఆర్ఎస్ ప్రాధాన్యం స్వప్నకు అండగా ఉంటామని అధిష్ఠానం...

నర్సంపేట పగ్గాలు పోచంపల్లికి!

నర్సంపేట పగ్గాలు పోచంపల్లికి! పెద్ది స్వప్నకు సమన్వయ బాధ్యతలు..! గురువారం తెలంగాణ భవన్‌లో వ‌రంగ‌ల్...

విదేశీ మద్యం ధరలు పెంపు

విదేశీ మద్యం ధరలు పెంపు ఫుల్‌ బాటిల్‌పై రూ.30 నుంచి రూ.100 వరకు...

పట్టభద్రుల బరిలో బీజేపీ బీసీ అస్త్రం

పట్టభద్రుల బరిలో బీజేపీ బీసీ అస్త్రం సుందర్‌రాజ్‌ వైపు అధిష్ఠానం చూపు! నల్లగొండ గ్రాడ్యుయేట్‌...

ఓపెన్ కాస్టుతో రామప్పకు ముప్పు త‌ప్ప‌దు

ఓపెన్ కాస్టుతో రామప్పకు ముప్పు త‌ప్ప‌దు సరస్సు నీరు భూగర్భంలోకి లీకయ్యే ప్రమాదం ఇప్ప‌టికే...

రీజినల్‌ ఐ హాస్పిటల్‌ను తరలిస్తే సహించేది లేదు

రీజినల్‌ ఐ హాస్పిటల్‌ను తరలిస్తే సహించేది లేదు ఉత్తర తెలంగాణ పేదలకు ఆసుపత్రి...

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు బీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు బీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు 13నుంచి సమ్మెకు దిగుతున్న ఉద్యోగులకు...

నైరుతి రుతుపవనాల తిరోగమనం

నైరుతి రుతుపవనాల తిరోగమనం జనగాం, భూపాలపల్లి మీదుగా కొనసాగుతున్న ఉపసంహరణ కాకతీయ, తెలంగాణ బ్యూరో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.