స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ అశోక్ కు సన్మానం
కాకతీయ, దుగ్గొండి : తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ టీ డైరెక్టర్ గా పదోన్నతి పొందిన అంతర్జాతీయ రెజ్లింగ్ కోచ్ గుగులోతు అశోక్ కుమార్ ను ఉమ్మడి వరంగల్ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ తరుపున సన్మానించారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లాల్ బహుదూర్ స్టేడియం లో అశోక్ కుమార్ ను ఉమ్మడి వరంగల్ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యాదగిరి సుధాకర్ గారు సన్మానించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ దుగ్గొండి ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి అయిన గుగులోతు అశోక్ కుమార్ అంచెలంచెలుగా డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి ఎదిగి అందరికి ఆదర్శంగా నిలిచినట్లు చెప్పారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.

