epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

విద్యుత్ కోతలపై భగ్గుమన్న బీఆర్ఎస్

విద్యుత్ కోతలపై భగ్గుమన్న బీఆర్ఎస్

వేములవాడ సబ్‌స్టేషన్‌ ఎదుట రైతులతో కలిసి మహా ధర్నా

24 గంటల ఉచిత విద్యుత్‌ పునరుద్ధరించాలి

రైతుల పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? – చల్మెడ లక్ష్మీనరసింహారావు

కాకతీయ, వేములవాడ: రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు, సాగునీటి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహా ధర్నా నిర్వహించారు. పట్టణంలోని చెక్కపల్లి రహదారిలో బీసీ హాస్టల్‌ సమీప సబ్‌స్టేషన్‌ ఎదుట జరిగిన ఈ ఆందోళనలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విద్యుత్‌ కోతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

24 గంటల ఉచిత విద్యుత్‌ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం!

ఈ సందర్భంగా చల్మెడ లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో రైతులకు అందించిన 24 గంటల ఉచిత విద్యుత్‌ను కొనసాగించడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యుత్‌ కోతల కారణంగా వ్యవసాయ మోటార్లు సక్రమంగా పనిచేయక, పంటలకు సాగునీరు అందక రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్‌నినో ప్రభావం ఉంటుందనే హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

రాజకీయ కక్షతోనే సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యం: చల్మెడ

రాష్ట్రంలో నీటి లభ్యత, విద్యుత్‌ ఉత్పత్తి అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని సమర్థంగా వినియోగించుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని చల్మెడ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటిని అందించే అవకాశాలున్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్వహణలో లోపాలే ప్రస్తుత విద్యుత్‌ సమస్యలకు కారణమని ఆయన పేర్కొన్నారు.

కళ్ల ముందే ఎండిపోతున్న పంటలు.. స్పందించని ప్రజాప్రతినిధులు!

వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట, రుద్రంగి మండలాలతో పాటు పలు గ్రామాల్లో విద్యుత్‌, సాగునీటి సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చల్మెడ అన్నారు. కష్టపడి సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయంలో ఎండిపోతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. రైతుల సమస్యలపై స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో విద్యుత్‌ సరఫరా పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.

రైతుల పంటలను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలి

రాబోయే మూడు నుంచి నాలుగు వారాల పాటు వ్యవసాయానికి ప్రతిరోజూ కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ నిరంతరాయంగా సరఫరా చేయాలని చల్మెడ డిమాండ్ చేశారు. నీటి ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించి చెరువులు, కుంటలను నింపాలని, గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు.

పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం

రైతులకు ఇచ్చిన ఉచిత విద్యుత్‌ హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని చల్మెడ లక్ష్మీనరసింహారావు డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగిస్తే బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా నిలిచి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలను మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కోత దశలోనైనా నీటిని విడుదల చేయండి!

కోత దశలోనైనా నీటిని విడుదల చేయండి! పంటలు ఎండిపోతున్నా పట్టించుకోరా? ఎల్ఎండీ నుంచి సాగునీటి...

జోగాపూర్‌లో దొంగల చేతివాటం!

జోగాపూర్‌లో దొంగల చేతివాటం! అర్ధరాత్రి భారీ చోరీ.. రూ.80 వేల నగదు సహా...

మల్యాల, లింగంపేటలో దుర్గమ్మకు చల్మెడ ప్రత్యేక పూజలు!

మల్యాల, లింగంపేటలో దుర్గమ్మకు చల్మెడ ప్రత్యేక పూజలు! అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో...

కరీంపేటలో దొంగల బీభత్సం..

కరీంపేటలో దొంగల బీభత్సం.. రైతుల మోటార్లు మాయం! ఒకే రాత్రి ముగ్గురు రైతులకు...

రైతులకు మద్దతుగా ఈనెల 23న కలెక్టరేట్ ముందు బిజెపి ధర్నా

రైతులకు మద్దతుగా ఈనెల 23న కలెక్టరేట్ ముందు బిజెపి ధర్నా రైతుల సమస్యల...

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి!

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి! ఈనెల 23న కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలి బీజేపీ...

వేములవాడలో సద్దుల బతుకమ్మ సంబరాలు!

వేములవాడలో సద్దుల బతుకమ్మ సంబరాలు! పూల పండుగలో ఆడపడుచుల ఆటపాటలు కోలాటం ఆడి.. డోలు...

అర్హులైన పేదలకు న్యాయం చేయాలి

అర్హులైన పేదలకు న్యాయం చేయాలి ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఓదెల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.