పేదలు ఆర్థికంగా ఎదగడమే లక్ష్యం
224 మంది మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ
స్వయం ఉపాధితో మహిళలకు ఆర్థిక భరోసా
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్
కాకతీయ, నెల్లికుదురు: పేద, బడుగు, బలహీన వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు తన వంతు సహకారం అందిస్తానని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. సోమవారం నెల్లికుదురు, ఇనుగుర్తి మండలాలకు చెందిన 224 మంది మహిళలకు జీజేసీ గ్రౌండ్లో కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు చందు రాజ్‌కుమార్ యాదవ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ హెచ్‌సీఎల్ కంపెనీ సహకారంతో నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పించి, ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో కుట్టు మిషన్లు అందించినట్లు తెలిపారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి ఆర్థికంగా ఎదిగేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడతానని పేర్కొన్నారు. సాధ్యమైనంతవరకు ప్రజాసేవకు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

