epaper
Thursday, October 1, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించాలి

చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించాలి
పెండింగ్‌ అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలి
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి

కాకతీయ, భూపాలపల్లి : రోడ్డు విస్తరణలో భాగంగా ఎన్నో ఏళ్లుగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న పేదల దుకాణాలను ప్రత్యామ్నాయం చూపకుండా తొలగించడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలకు ఎవరూ వ్యతిరేకం కాదని, అయితే అభివృద్ధి పేరుతో పేద చిరు వ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీయడం సరికాదన్నారు. కూరగాయలు, పండ్లు, చికెన్‌ సెంటర్లు, టీ స్టాల్స్‌, సెలూన్లు తదితర వ్యాపారాలపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ప్రత్యామ్నాయ స్థలాలు కల్పించి, జీవనోపాధికి భరోసా ఇచ్చిన తర్వాతే తొలగింపు చర్యలు చేపట్టాలని కోరారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పట్టణ అభివృద్ధిలో భాగంగా టెండర్లు పిలిచి ప్రారంభించిన అనేక పనులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3 సంవత్సరాలు అవుతున్నా ఆ పనులను ఎందుకు నిలిపివేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కలెక్టర్‌, సంబంధిత మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు పెండింగ్‌ పనులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో భూపాలపల్లి పట్టణంలోని పేదల కోసం సుమారు 1,000 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించగా, అందులో సుమారు 500 ఇళ్లను తమ హయాంలోనే పేద కుటుంబాలకు అందించామని గండ్ర తెలిపారు. 4 సంవత్సరాలుగా ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాలను విచారణ పేరుతో భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. ఇళ్లను ఆసరాగా చేసుకుని మధ్యవర్తులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పేదలను ఇబ్బందులకు గురిచేసే చర్యలను నిలిపివేసి, వారి జీవనోపాధికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ఐక్యంగా ముందుకు సాగుదాం

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ఐక్యంగా ముందుకు సాగుదాం కార్మికుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా...

టీయూడబ్ల్యూజే మండల కమిటీ ఎన్నిక

టీయూడబ్ల్యూజే మండల కమిటీ ఎన్నిక కాకతీయ, నెల్లికుదురు : టీయూడబ్ల్యూజే-143 నెల్లికుదురు మండల...

లెంకపల్లి సర్పంచ్‌ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన హరీశ్‌రావు

లెంకపల్లి సర్పంచ్‌ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన హరీశ్‌రావు కాకతీయ, నర్సంపేట: ఇటీవల రోడ్డు...

ప్రశ్నపత్రాల బాహ్య మూల్యాంకన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

ప్రశ్నపత్రాల బాహ్య మూల్యాంకన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి కాకతీయ, నెల్లికుదురు: ప్రశ్నపత్రాల బాహ్య...

సీజనల్‌ వ్యాధులపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

సీజనల్‌ వ్యాధులపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి పట్టుదలతో...

రేవంత్‌ సర్కార్‌కు అనస్థీషియా తప్పదు

రేవంత్‌ సర్కార్‌కు అనస్థీషియా తప్పదు కాంగ్రెస్ హామీలన్నీ మోసాలేనని ప్రజలు గుర్తించారు నా పనితీరే...

వాగ్దేవి స్కూల్లో సైన్స్‌ ఫెయిర్‌ ఎగ్జిబిషన్‌

వాగ్దేవి స్కూల్లో సైన్స్‌ ఫెయిర్‌ ఎగ్జిబిషన్‌ కాకతీయ, ఇనుగుర్తి: ఇనుగుర్తి మండల కేంద్రంలోని...

ప్రమాదాల నివారణే లక్ష్యం

ప్రమాదాల నివారణే లక్ష్యం వర్ధన్నపేట,రాయపర్తిలో రోడ్డు ప్రమాద స్థలాల పరిశీలన వరంగల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.