epaper
Wednesday, October 7, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పించాలి

ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పించాలి
వివక్షను తొలగించి గౌరవంగా జీవించేలా సహకరించాలి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కందుకూరి పూజ

కాకతీయ, హనుమకొండ : సమాజంలో ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులపై వివక్షను తొలగించి, వారికి గౌరవప్రదమైన జీవనం అందించేందుకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కందుకూరి పూజ అన్నారు. మంగళవారం సుబేదారిలోని అసంత భవన్‌లో ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ, మోడరన్‌ అవేర్‌నెస్‌ సొసైటీ, వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ ప్రైడ్‌ ప్లేస్‌ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రాన్స్‌జెండర్లపై వివక్ష కొనసాగడం బాధాకరమన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వ శాఖలు, ఇతర సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అధికారులు, సమాజం సహకరించాలని కోరారు. నైపుణ్య శిక్షణ పొందుతూ స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. హక్కులకు భంగం కలిగినా, వేధింపులకు గురైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయిస్తే న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు.

మానవ అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలి

యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ ఇన్‌స్పెక్టర్‌, ట్రాన్స్‌జెండర్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ ఇన్‌చార్జి ఓ. రమేష్‌ మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణకు ప్రైడ్‌ ప్లేస్‌ పనిచేస్తోందన్నారు. ప్రేమ, ఉపాధి పేరుతో అక్రమ రవాణాకు పాల్పడితే పోలీసులను సంప్రదించాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి కే. విశ్వజ మాట్లాడుతూ స్వయం ఉపాధికి ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్‌ సిస్టర్‌ సహాయ, ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ ఎర్ర శ్రీకాంత్‌, ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీ నాయకురాలు లైలా, ఎస్సైలు శ్రావణి, సుధాకర్‌, ఏఎస్సై భాగ్యలక్ష్మి, కానిస్టేబుల్‌ రామారావు, ఇక్బాల్‌ పాషా, అజయ్‌కుమార్‌, కె. రవి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ట్రాన్స్‌జెండర్‌, గే, శివశక్తి కమ్యూనిటీలకు చెందిన సుమారు 160 మంది హాజరయ్యారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖాతాదారుల బంగారంతో బెట్టింగ్‌

ఖాతాదారుల బంగారంతో బెట్టింగ్‌ బ్యాంకుకు తెలియకుండా మరో సంస్థలో తనఖా.. అసిస్టెంట్‌ మేనేజర్‌...

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో...

భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట భద్రత..

భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట భద్రత.. జాతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్...

ఏజెన్సీకి న్యాయ సేవలు విస్తరించాలి

ఏజెన్సీకి న్యాయ సేవలు విస్తరించాలి ఏటూరునాగారంలో అదనపు జేఎఫ్‌సీఎం కోర్టు ఏర్పాటు చేయాలంటున్న...

నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి మహాజ్యోతి పూజ

నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి మహాజ్యోతి పూజ కాకతీయ, గీసుగొండ: ప్రసిద్ధ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి...

బతుకమ్మ, దసరా వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి

బతుకమ్మ, దసరా వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ వరంగల్...

ఎస్ఐ, పీసీ ఉద్యోగాలకు ఉచిత రెసిడెన్షియల్‌ కోచింగ్‌

ఎస్ఐ, పీసీ ఉద్యోగాలకు ఉచిత రెసిడెన్షియల్‌ కోచింగ్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ...

బాహ్య మూల్యాంకనం సరికొత్త విధానం

బాహ్య మూల్యాంకనం సరికొత్త విధానం ఆరు, తొమ్మిదో తరగతి జవాబు పత్రాల పరిశీలన నిర్ణీత...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.