epaper
Tuesday, October 6, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డికి బెయిల్‌

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డికి బెయిల్‌
67 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలకు మార్గం
మహిళా ట్రైనీ ఐపీఎస్‌ ఫిర్యాదుతో నమోదైన కేసు
షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన ఉప్పర్‌పల్లి కోర్టు
అత్తాపూర్‌ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు
ఆరోపణలు అవాస్తవమన్న ఉదయ్‌ కృష్ణారెడ్డి

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : మహిళా ట్రైనీ ఐపీఎస్‌ అధికారిణిని లైంగికంగా వేధించారన్న కేసులో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ లభించింది. దాదాపు 67 రోజుల పాటు జైలులో ఉన్న ఆయనకు రంగారెడ్డి జిల్లా ఉప్పర్‌పల్లి కోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న సమయంలో ఈ వ్యవహారం చోటుచేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డిపై మహిళా ట్రైనీ ఐపీఎస్‌ అధికారిణి అత్తాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్టు చేసి ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

గదిలోకి లాక్కెళ్లి బెదిరించారని ఫిర్యాదు

జూలై 8న ఉదయ్‌ కృష్ణారెడ్డి తనను బలవంతంగా ఆయన గదిలోకి లాక్కెళ్లి భయభ్రాంతులకు గురిచేసి ఫోన్‌ పాస్‌వర్డ్‌ తీసుకున్నారని మహిళా ట్రైనీ ఐపీఎస్‌ అధికారిణి ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. జూలై 9న మరోసారి తనను జుట్టు పట్టుకుని ఆయన గదిలోకి లాక్కెళ్లి మెడపై కత్తి పెట్టి బెదిరించారని ఆరోపించారు. తనతో అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు వ్యక్తిగత వీడియోలను చిత్రీకరించారని, వాటిని తన భర్తకు పంపి బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్‌ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఉదయ్‌ కృష్ణారెడ్డి గతంలో సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా స్పందించారు. తనపై వస్తున్న ఫిర్యాదులు, వదంతులు నిరాధారమైనవని, అవాస్తవాలని పేర్కొంటూ న్యాయం గెలుస్తుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. అనంతరం బంధువుల ఇంటికి వెళ్లిన ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. బంధువులు వెంటనే ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు.

సుదీర్ఘ రిమాండ్‌ అనంతరం బెయిల్‌

కోర్టు రిమాండ్‌ విధించడంతో ఉదయ్‌ కృష్ణారెడ్డి చంచల్‌గూడ జైలులో ఉన్నారు. సుమారు 67 రోజుల పాటు జైలులో ఉన్న ఆయనకు తాజాగా ఉప్పర్‌పల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. కేసులో తదుపరి న్యాయ ప్రక్రియ కొనసాగనుంది. కాగా, మహిళా ట్రైనీ ఐపీఎస్‌ అధికారిణి చేసిన ఆరోపణలు, వాటిపై నమోదైన కేసు, ఉదయ్‌ కృష్ణారెడ్డి స్పందన తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రేవంత్‌, కేసీఆర్‌ ఆస్తులపై విచారణ జరపాలి

రేవంత్‌, కేసీఆర్‌ ఆస్తులపై విచారణ జరపాలి కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ ఆరోపణలపై న్యాయ విచారణ...

కరెంట్‌ కోతలు.. బిల్లులతో వాతలు

కరెంట్‌ కోతలు.. బిల్లులతో వాతలు రూ.5,420 కోట్ల భారం మోపే హక్కు ఎవరిచ్చారు కరెంట్‌...

బోగస్‌ ఫారం–7లపై కొరడా

బోగస్‌ ఫారం–7లపై కొరడా తప్పుడు దరఖాస్తులతో ఓట్ల తొలగింపునకు కుట్ర చేస్తే చర్యలు క్షుణ్ణంగా...

పరాయి పాలన వచ్చింది!

పరాయి పాలన వచ్చింది! ప్ర‌శ్నార్థ‌కంగా తెలంగాణ అస్తిత్వం తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు తరలిపోతున్నాయి ఉద్యోగాలు మనవే.....

పదవికో రేటు.. పనికో వాటా?

పదవికో రేటు.. పనికో వాటా? వ‌రంగ‌ల్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే ప‌నితీరుపై ఆరోప‌ణ‌లు బేర‌సారాల‌తోనే...

100 శాతం పంటను కొనాలి

100 శాతం పంటను కొనాలి మద్దతు ధర ప్రకట‌న‌తో బాధ్య‌త పూర్తిన‌ట్లు కాదు వర్షాభావ...

ఇసుక లోడింగ్‌పై అద‌న‌పు బాదుడు

ఇసుక లోడింగ్‌పై అద‌న‌పు బాదుడు డీడీ కట్టినా లోడింగ్‌ పేరుతో అదనపు బాదుడు దొడ్డు...

ఆల‌స్యం త‌ప్ప‌దా..?!

ఆల‌స్యం త‌ప్ప‌దా..?! వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీకి ఇంకా బ్రేకులే ఐదేళ్లుగా సాగుతున్న భారీ నిర్మాణం భవనాలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.