ఏనుమాముల మార్కెట్ కు భద్రత కట్టుదిట్టం
కమాండ్ కంట్రోల్ కు
120 సిసి కెమెరాలు
అనుసంధానం
మార్కెట్ చైర్మన్ ప్రియాంక
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు మార్కెట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.
గత 10 సంవత్సరాలలో జరిగిన అవాంఛనీయ ఘటనల దృష్ట్యా, రైతు సోదరుల సరుకులు రాత్రి సమయంలో మొదలవుతాయని, ఈ నేపథ్యంలో రైతు సరుకులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా, అసాంఘిక వ్యక్తులు, ట్రాన్స్ పోర్ట్ వాహనాల ఎంట్రీని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది.

మహిళల భద్రతకు పెద్దపీట
ముఖ్యంగా కూరగాయల మార్కెట్ నందు జరిగే దొంగతనాలు నివారించుటకు, తెల్లవారుజామున కూరగాయల వ్యాపారానికి వచ్చే మహిళల భద్రత దృష్ట్యా, పటిష్ట భద్రత కల్పించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ చైర్మన్ పులి ప్రియాంక తెలిపారు.
ఇందులో భాగంగా ఏనుమాముల, కూరగాయల మార్కెట్ లో ఏర్పాటు చేసిన 120 సి.సి. కెమెరాలను వరంగల్ కమిషనరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
దీని వల్ల మార్కెట్ లో పూర్తి స్థాయిలో నిఘా పెరగడంతో పాటు, నేరాలు అదుపులోకి వస్తాయని చైర్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

