epaper
Friday, October 9, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సైబర్ నేరాల నియంత్రణలో వరంగల్ పోలీసుల ప్రత్యేక చర్యలు..

సైబర్ నేరాల నియంత్రణలో వరంగల్ పోలీసుల ప్రత్యేక చర్యలు..

9 నెలల్లో 3,952 ఫిర్యాదులు.. 174 మంది నిందితుల అరెస్ట్..

బాధితులకు రూ.5.23 కోట్ల నగదు పునరుద్ధరణ..

సెప్టెంబర్‌లోనే రూ.49.56 లక్షలు బాధితులకు తిరిగి అందజేత..

కాకతీయ, వరంగల్ బ్యూరో : సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర సహాయం అందించడం, మోసపోయిన నగదును రికవరీ చేయడం, నేరస్థులను గుర్తించి అరెస్టు చేయడంతో పాటు ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన కల్పించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా సైబర్ నేరాలకు సంబంధించిన నెలవారీ పనితీరు నివేదికలను ఇకపై ప్రతి నెలా మీడియా ద్వారా వెల్లడించనున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌ (ఎన్ సీ ఆర్ పి ) ద్వారా వరంగల్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 3,952 ఫిర్యాదులు అందాయి. వీటిలో 1,155 ఫిర్యాదులను పరిష్కరించారు. సైబర్ నేరాలకు సంబంధించి 105 కేసులను ఛేదించి 174 మంది నిందితులను అరెస్టు చేశారు. మిగిలిన ఫిర్యాదులపై దర్యాప్తు, తదుపరి చర్యలు కొనసాగుతున్నాయి. సైబర్ మోసాల కారణంగా బాధితులు సుమారు రూ.20.66 కోట్లు నష్టపోగా, రూ.5.23 కోట్ల నగదును బాధితులకు తిరిగి అందించడంలో పోలీసులు చర్యలు చేపట్టారు.

సమన్వయంతో ఫిర్యాదుల పరిష్కారం..

సమన్వయ వ్యవస్థ ద్వారా పోలీస్ స్టేషన్లకు పంపిన 983 అభ్యర్థనల్లో 866ను పూర్తి చేశారు. బ్యాంకింగ్ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం జీఆర్‌ఎం పోర్టల్ ద్వారా ప్రజలు 104 ఫిర్యాదులు నమోదు చేయగా, వాటిలో 83 ఫిర్యాదులను పరిష్కరించారు. అదేవిధంగా ఎంఆర్‌ఎం ద్వారా బ్యాంకింగ్ సంబంధిత సమస్యలపై 789 అభ్యర్థనలు అందగా, 615 అభ్యర్థనలను పరిష్కరించారు. ఈ ప్రక్రియ ద్వారా బాధితులకు రూ.21.44 లక్షలు తిరిగి అందించారు. సైబర్ నేరస్థులను గుర్తించేందుకు చేపట్టిన అక్యూజ్డ్ ప్రొఫైలింగ్‌లో 116 అభ్యర్థనలను స్వీకరించి 100 శాతం పూర్తి చేశారు.

286 అవగాహన కార్యక్రమాలు.. సెప్టెంబర్‌లో 34 మంది అరెస్ట్..

ప్రజల్లో సైబర్ నేరాలపై అప్రమత్తత పెంచేందుకు జూన్, జూలై, ఆగస్టు నెలల్లో వరంగల్ కమిషనరేట్ పరిధిలో 286 సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలకు ఆన్‌లైన్ మోసాల తీరుతెన్నులు, బ్యాంకింగ్ మోసాలు, అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. సెప్టెంబర్ 2026లో మాత్రమే ఎన్ సీ ఆర్ పి ద్వారా 483 సైబర్ ఫిర్యాదులు అందగా, వాటిలో 95 ఫిర్యాదులను పరిష్కరించి 10 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఎం ఆర్ ఎం ద్వారా 285 అభ్యర్థనలు అందాయి. వీటిలో బాధితుల నగదుకు సంబంధించి రూ.50.87 లక్షలను పునరుద్ధరించదగిన మొత్తంగా గుర్తించగా, రూ.49.56 లక్షలను బాధితులకు తిరిగి అందించారు. అదే సమయంలో సైబర్ నేరాలకు పాల్పడిన 34 మంది నిందితులను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు.

1930కు వెంటనే ఫోన్ చేయాలి..

సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930కు ఫోన్ చేసి, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే నగదును నిలుపుదల చేసి, బాధితులకు తిరిగి అందించే అవకాశం పెరుగుతుందని తెలిపారు. అప్రమత్తంగా ఉండండి, సైబర్ నేరాల నుంచి సురక్షితంగా ఉండండి అని పోలీసులు ప్రజలకు సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ధైర్యంగా ఉండు..నేనున్నా!

ధైర్యంగా ఉండు..నేనున్నా! అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు ఎర్రబెల్లి అభయం కాకతీయ,రాయపర్తి : ఏమి అధైర్య...

కొత్త రేషన్‌ కార్డులతో పేదలకు భరోసా

కొత్త రేషన్‌ కార్డులతో పేదలకు భరోసా పేదవాడి ఆకలి తీరుస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ప‌ర‌కాల...

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి..

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి.. కాకతీయ, హనుమకొండ : ఓటర్ల...

కోఆప్షన్‌ ఎన్నికలకు ఎందుకింత భయం?

కోఆప్షన్‌ ఎన్నికలకు ఎందుకింత భయం? బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఎక్కువగా ఉన్నందుకే వాయిదా ఎన్నికై ఏడాది...

బాధిత కుటుంబాలకు భరోసా

బాధిత కుటుంబాలకు భరోసా మృతుల కుటుంబాలకు పార్టీ, వ్యక్తిగతంగా అండగా ఉంటా కుటుంబ పెద్దలను...

భాధిత కుటుంబాలకు భరోసా

భాధిత కుటుంబాలకు భరోసా టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి కాకతీయ,రాయపర్తి : ఇటీవల...

పల్లె పండుగలతో ఆదర్శంగా నిలవాలి

పల్లె పండుగలతో ఆదర్శంగా నిలవాలి *మహిళలకు చీరలు పంపిణీ చేసిన శ్రీనివాస్ రెడ్డి కాకతీయ,...

బాలల స్నేహపూర్వక నగరంగా వరంగల్

బాలల స్నేహపూర్వక నగరంగా వరంగల్ జీడబ్ల్యూఎంసీలో ‘నర్చరింగ్ నెయిబర్ హుడ్స్-2.0’ వర్క్ షాప్ కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.