టీబీ నిర్మూలనలో రుప్లా తండాకు జిల్లా స్థాయి గుర్తింపు..!
– వ్యాధి నివారణకు విశేష కృషి..
– కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న గ్రామ ప్రతినిధులు..
కాకతీయ, రుద్రంగి : టీబీ నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం రుప్లా తండా గ్రామం ప్రత్యేక గుర్తింపు సాధించింది. టీబీ నివారణ చర్యలు, ప్రజల్లో వ్యాధిపై అవగాహన కల్పించడంలో చేసిన కృషికి గుర్తింపుగా గ్రామానికి జిల్లా స్థాయి అవార్డు లభించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ భూక్యా జవహర్ లాల్ నాయక్, సెక్రెటరీ మహమ్మద్ అజీజ్, ఏఎన్ఎం కృష్ణవేణి అవార్డును అందుకున్నారు. గ్రామ ప్రజల భాగస్వామ్యం, వైద్య సిబ్బంది సమన్వయంతో సాధించిన ఈ గుర్తింపు పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. టీబీ రహిత సమాజ నిర్మాణానికి గ్రామస్థాయిలో చేపట్టిన కృషికి ఈ అవార్డు నిదర్శనంగా నిలిచింది.


