సర్పంచ్ చొరవతో విద్యుత్ సౌకర్యాల కల్పన
నూతన ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం
వైకుంఠధామానికి 20 పోల్స్‌కు కనెక్షన్
కాకతీయ, గీసుగొండ : గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రాంపూర్ సర్పంచ్ రడం భరత్ చొరవ చూపారు. మండలంలోని రాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గట్టు కింది పల్లెలో నూతనంగా ఏర్పాటు చేసిన 15 కేవీఏ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు వైకుంఠధామానికి సంబంధించిన 20 నూతన విద్యుత్ పోల్స్‌కు కనెక్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ట్రాన్స్ ఫార్మర్ కు విద్యుత్ కనెక్షన్ అందించే ప్రక్రియలో స్వయంగా పాల్గొని వైర్‌ను అనుసంధానించారు. గ్రామంలో విద్యుత్ సౌకర్యాల మెరుగుదలతో పాటు వైకుంఠధామానికి అవసరమైన విద్యుత్ సదుపాయాల కల్పనకు సహకరించిన విద్యుత్ శాఖ అధికారులకు గ్రామ పంచాయతీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడీ రవికుమార్, ఏఈ సందీప్, లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కాంట్రాక్టర్ వీరన్న, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ,శ్రీకాంత్,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

