సీసీ రోడ్డు ఇలా… నడిచేదెలా ?
కాకతీయ, పెద్దవంగర : పై ఫొటోలో చిత్తడిగా మారిన రోడ్డు మట్టి రోడ్డు అనుకుంటే పొరపాటు పడినట్టే. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర గ్రామ పంచాయతీలో ముత్యాలమ్మ గుడి నుండి గౌడ బజారుకు పోయే సీసీ రోడ్లు నిత్యం బురదమయంగా ఉన్నది. సైడ్ డ్రైనేజీల లేక వర్షపు నీటితో కొట్టుకొచ్చిన మట్టి సిసి రోడ్డుపై ఉండటంతో,పై బజారు నుండి వస్తున్నా మురికి నీరు వచ్చి మొత్తం బురద మయంగా మారింది.కనీసం నడవడానికి వీలు లేకుండా ఉంటున్నాయని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీసీ రోడ్డు బొడ్రాయి సెంటర్ వద్ద ప్రధాన రహదారికి వెళ్లే రహదారి. ఈ రహదారి వెంబడి పాఠశాలకు వెళ్లే పిల్లలు, అంగన్వాడీ పిల్లలు, నిత్యవసరాలకు, ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు, కూలీలు ప్రతినిత్యం నడిచే దారి ఇది. ఈ మురికి నీరు దుర్వాసనతో ప్రజలు ఈ దారిలో నడవాలంటే జంకుతున్నారు. ప్రజా ప్రతినిధులు,అధికారులు స్పందించి సిసి రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించి సైడ్ డ్రైనేజి వేయాలని అక్కడి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

