కాకతీయ ఎఫెక్ట్
సమాజ భద్రతకు దాతల చేయూత
కాకతీయ కథనానికి కదిలిన పోలీసు యంత్రాంగం
రాయపర్తి లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కదులుతున్న అడుగులు
రూ.20,000 విరాళం అందించిన మహాలక్ష్మి చికెన్ సెంటర్ యజమాని చెన్నబోయిన రవి
ఆర్థిక సహాయం అందించి ఆదర్శంగా నిలిచిన రవిని అభినందించిన స్థానికులు
కాకతీయ,రాయపర్తి : మండల కేంద్రంలో శాంతిభద్రతల పరిరక్షణ,నేరాల నియంత్రణే ధ్యేయంగా సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది.ఆగస్టు 5న ఉత్తరం కాకతీయ దినపత్రికలో ‘మూడో కన్ను లేక మూగబోయిన భద్రత ‘ శీర్షికన కథనం వెలువడింది.ఈ ప్రత్యేక శీర్షికతో వచ్చిన వార్త కథనం స్థానిక పోలీసు యంత్రాంగంలో కదలికను తీసుకొచ్చింది.తక్షణమే స్పందించిన రాయపర్తి ఎస్సై ముత్యం రాజేందర్ సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.పోలీసు శాఖ పిలుపునకు, కాకతీయ దినపత్రిక చొరవకు స్పందించి స్థానిక వ్యాపారస్తులు,దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.ఈ క్రమంలో మండల కేంద్రానికి చెందిన మహాలక్ష్మి చికెన్ సెంటర్ యజమాని,మహబూబ్ నగర్ గ్రామ ఉపసర్పంచ్ చెన్నెబోయిన రవి రూ.20,000 ఆర్థిక విరాళాన్ని బుధవారం ఎస్సైకి అందజేశారు.ఈ సందర్భంగా దాత చెన్నెబోయిన రవి మాట్లాడుతూ..గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు వల్ల నేరాలు,దొంగతనాలు గణనీయంగా తగ్గుతాయని అన్నారు.మహిళల భద్రతకు ‘మూడో కన్ను'( సీసీ కెమెరాలు)ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.ఎస్సై పిలుపునకు స్పందించి ఈ విరాళం అందించినట్లు ఆయన తెలిపారు.ఆర్థిక సాయం అందించి ఆదర్శంగా నిలిచిన చెన్నెబోయిన రవిని ప్రజాప్రతినిధులు,స్థానిక ప్రజలు ప్రత్యేకంగా అభినందించారు.సమాజ శ్రేయస్సు కోసం మిగతా వ్యాపారులు,దాతలు కూడా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటుకు తమ వంతు సహకారం అందించాలని ఎస్సై రాజేందర్ కోరారు.


