గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలి
కేసీ వేణుగోపాల్కు డాక్టర్ రామకృష్ణ వినతి
పార్టీ సేవలు, రాజకీయ ప్రస్థానంతో బయోడేటా అందజేత
కాకతీయ, హన్మకొండ : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే పేదలకు మరింత విస్తృతంగా సేవలందిస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి సచిన్ సావంత్ను కలిసి తన అభ్యర్థనను వివరించారు. పార్టీ కోసం విద్యార్థి దశలో ఎన్ఎస్యూఐ నుంచి పనిచేసిన ప్రస్థానం, రాజకీయ అనుభవం, ప్రజాసేవ వివరాలతో కూడిన బయోడేటాను కేసీ వేణుగోపాల్కు అందజేశారు. కాంగ్రెస్ అధిష్టానంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే నాయకులను నాయకత్వం గుర్తిస్తుందనే నమ్మకం ఉందని రామకృష్ణ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డిపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. తన సేవలను, రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజలకు మరింత చేరువగా ఉండేందుకు నిరంతరం కృషి చేస్తున్న నాయకులకు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు. పదవులు బాధ్యతతో కూడుకున్నవని, అవకాశం లభిస్తే ప్రజాసేవను మరింత విస్తృతం చేస్తానని తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన నాయకులకు సముచిత ప్రాధాన్యం కల్పించడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతమవుతుందని డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ అభిప్రాయపడ్డారు.

