సాఫ్ట్బాల్ పోటీలను విజయవంతం చేయాలి
క్రీడలతో చెడు వ్యసనాలకు దూరం
మాజీ కార్పొరేటర్ బోడ డిన్న
కాకతీయ, హనుమకొండ :క్రీడలను ప్రోత్సహించడంతో యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండటంతోపాటు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు లభిస్తాయని మాజీ కార్పొరేటర్ బోడ డిన్న అన్నారు. హనుమకొండ జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16, 17 తేదీల్లో ములుగు రోడ్డులోని లాల్ బహదూర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించనున్న మినీ సబ్ జూనియర్ బాలుర సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను విజయవంతం చేయాలని కోరారు. మైదానంలో టోర్నమెంట్ ఏర్పాట్లు, క్రీడాకారులకు అందిస్తున్న శిక్షణను పరిశీలించారు. అసోసియేషన్ సేవలను అభినందిస్తూ, వాటిని సద్వినియోగం చేసుకుని క్రీడాకారులు ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. అసోసియేషన్కు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన జిల్లా క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శులు తాబేటి రాజేందర్, ఎం. భగత్, ఉపాధ్యక్షుడు పెరుమాండ్ల సాంబమూర్తి, సంయుక్త కార్యదర్శులు సుమలత, రాజేశ్వర్, కోచ్లు పోలేపాక వినయ్కుమార్, తాబేటి నాగరాజు, బుస రాజు, ఏ. సృజన, సుష్మ, శశాంక్, క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

