epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎమ్మెల్సీ అభ్యర్థి విజయమే లక్ష్యం

ఎమ్మెల్సీ అభ్యర్థి విజయమే లక్ష్యం
ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి
బూత్ స్థాయి నుంచి సమన్వయంతో పనిచేయాలి
పార్టీ శ్రేణులకు హ‌న్మ‌కొండ డీసీసీ అధ్య‌క్షుడు ఇనగాల పిలుపు
మడికొండలో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ సమన్వయ సమావేశం

కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండ జిల్లా మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్‌లో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి పట్టభద్రులు భారీ మెజారిటీ అందించారని గుర్తుచేశారు. అదే విజయ పరంపరను రాబోయే ఎన్నికల్లోనూ కొనసాగించాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చేపడుతున్న ఉద్యోగ నియామకాలు, సంక్షేమ పథకాలు, విద్యా, ఉపాధి రంగాల్లో సాధిస్తున్న ప్రగతిని పట్టభద్రులకు వివరించాలని సూచించారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని గుర్తించి ఓటరుగా నమోదు చేయించడంతోపాటు, పోలింగ్ బూత్ స్థాయి నుంచి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి ప్రచారాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని, ఈ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి..

సమావేశంలో పాల్గొన్న ఎంపీలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, నిరుద్యోగులకు కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలను పట్టభద్రులకు వివరించాలని సూచించారు. నవంబర్ 6వ తేదీలోగా అర్హులైన ప్రతి పట్టభద్రుడిని గుర్తించి ఫారం-18 ద్వారా ఓటరుగా నమోదు చేయించే ప్రక్రియను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ ఓటర్ల నమోదు ప్రక్రియను పర్యవేక్షించాలని అన్నారు.

బూత్ స్థాయి నుంచి సమన్వయంతో పనిచేయాలి..

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గం, మండలం, గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోలింగ్ బూత్ స్థాయి నుంచి ప్రచార కార్యక్రమాలను నిర్వహించి, కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల సమస్యలను శాసనమండలిలో వినిపించే నాయకుడిగా ఆయనను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి అనసూయ (సీతక్క), రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, శంకర్ నాయక్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, కె.ఆర్. నాగరాజు, హనుమాండ్ల యశస్విని రెడ్డి, జాటోత్ రాంచంద్రు నాయక్, డాక్టర్ భూక్య మురళి నాయక్ తదితర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రజా సమస్యలను ప‌రిష్క‌రించాలి

ప్రజా సమస్యలను ప‌రిష్క‌రించాలి నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు! తాగునీటి సమస్యలపై తక్షణ చర్యలు...

పత్తికి రూ.9,200.. మొక్కజొన్నకు రూ.2,900

పత్తికి రూ.9,200.. మొక్కజొన్నకు రూ.2,900 ధరలు పెరగడంతో రైతుల హర్షం కాకతీయ, కేసముద్రం: కేసముద్రం...

ఏనుమాములలో ధరల మోసం.. ఇద్దరి లైసెన్సులు రద్దు!

ఏనుమాములలో ధరల మోసం.. ఇద్దరి లైసెన్సులు రద్దు! 190 బస్తాల మిర్చి ధరలో...

పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి శాంతిభద్రతల పరిరక్షణకు...

పి ఆర్ టి యు రాష్ట్ర శాఖ ఎన్నికల్లో మండల సభ్యులకు చోటు

పి ఆర్ టి యు రాష్ట్ర శాఖ ఎన్నికల్లో మండల సభ్యులకు...

జీడబ్ల్యూఎంసీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటిన వేడుకలు

జీడబ్ల్యూఎంసీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటిన వేడుకలు పూల సోయగాలతో ముస్తాబైన ప్రాంగణం...

మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ పేద, నిరుద్యోగ మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం జాతీయ ఎస్టీ...

బతుకమ్మ సంబరాల్లో ములుగు కలెక్టరేట్‌

బతుకమ్మ సంబరాల్లో ములుగు కలెక్టరేట్‌ మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.