కలాం సేవలు చిరస్మరణీయం
క్షిపణి రంగంలో ఆయన కృషి ప్రపంచానికి మార్గదర్శకం
విద్యార్థులు కలాం జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి
కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి
కాకతీయ, హనుమకొండ : భారతదేశ శాస్త్రసాంకేతిక రంగానికి విశేష సేవలందించిన భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయమని కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి అన్నారు. శాస్త్రసాంకేతిక రంగాల్లో భారతదేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మహనీయుడు కలాం అని కొనియాడారు. గురువారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ కన్వీనర్ తాళ్లపెల్లి జనార్దన్ గౌడ్ అధ్యక్షతన అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మర్రి యాదవ రెడ్డి మాట్లాడుతూ, భారత క్షిపణి పితామహుడిగా పేరొందిన అబ్దుల్ కలాం కీర్తి అజరామరమని పేర్కొన్నారు. అణ్వాయుధాల రూపకల్పన, క్షిపణుల తయారీలో ఆయన చేసిన కృషి ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా, సామాన్య పౌరుడిగా ఆయన అనుసరించిన జీవన విధానం ఎంతోమందికి ఆదర్శప్రాయమని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు కలాం జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని శాస్త్రసాంకేతిక రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మైనార్టీ విభాగం జిల్లా బాధ్యులు నయీమొద్దీన్, డివిజన్ అధ్యక్షులు రాజు, సదాంత్, శివకుమార్, సీనియర్ నాయకులు రవీందర్ రావు, జానకీరాములు, చాగంటి రమేష్, మల్లేశం, నాయిని రవి, సారంగపాణి, నాయకులు ఇస్మాయిల్, నారాయణగిరి రాజు, ఎస్కే మహమూద్, ఖలీల్, గౌస్ ఖాన్, సర్దార్, బైరపాక ప్రశాంత్, సారిక, పబ్బోజు శ్రీకాంత్ చారి, మంద సృజన్ కుమార్, అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు.

