epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బతుకమ్మ వేళ 109 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు

బతుకమ్మ వేళ 109 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు
మంత్రి సీతక్క చేతుల మీదుగా మంజూరు పత్రాల పంపిణీ రూ.5.45 కోట్లతో 13 గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు

కాకతీయ, ములుగు : పేదల సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. శుక్రవారం గోవిందరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావుతో కలిసి 13 గ్రామాలకు చెందిన 109 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.5.45 కోట్లతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. బతుకమ్మ పండుగ వేళ మంజూరు పత్రాలు అందజేయడం సంతోషంగా ఉందని వచ్చే ఏడాది లబ్ధిదారులు తమ సొంతింట్లోనే బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

పారదర్శకంగా ఎంపిక.. అర్హులకు మరో అవకాశం..

ములుగు నియోజకవర్గంలో మొదటి విడతలో సుమారు ఐదు వేల ఇళ్లను మంజూరు చేశామని, రెండో విడతలోనూ అర్హులకు అవకాశం కల్పిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ప్రస్తుత విడతలో ఇళ్లు రాని అర్హులు ఆందోళన చెందవద్దని తదుపరి విడతల్లో అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. లబ్ధిదారులు ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకొని ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని, పునాది స్థాయి పూర్తయిన తర్వాత బిల్లుల చెల్లింపులు ప్రారంభమవుతాయని వివరించారు. మహిళా సంఘాల సభ్యులకు ప్రారంభ నిర్మాణ ఖర్చుల కోసం సంఘాల ద్వారా రూ.లక్ష రుణం పొందే అవకాశం ఉందన్నారు. నిర్మాణాలకు అవసరమైన ఇసుకను నిబంధనల ప్రకారం అందుబాటులో ఉంచేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని, సర్పంచులు లబ్ధిదారులకు సహకరించాలని సూచించారు.

సంక్షేమ పథకాల అమలు.. ప్రజలకు అండగా ప్రభుత్వం

ఉచిత విద్యుత్‌, రేషన్‌ బియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలతో ప్రజా ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని మంత్రి తెలిపారు. కొత్త పింఛన్ల కోసం స్వీకరించిన దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన పూర్తిచేసి తదుపరి చర్యలు చేపడతామన్నారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో వంద రోజుల పనులను విస్తృతంగా కల్పించి, పని పరిమాణాన్ని బట్టి రోజుకు సుమారు రూ.310 వరకు కూలి పొందే అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రకృతి మార్పుల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్‌ రామ్‌నాథ్‌ కేకన్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ సంపత్‌రావు, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగ కళ్యాణి, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రజా సమస్యలను ప‌రిష్క‌రించాలి

ప్రజా సమస్యలను ప‌రిష్క‌రించాలి నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు! తాగునీటి సమస్యలపై తక్షణ చర్యలు...

పత్తికి రూ.9,200.. మొక్కజొన్నకు రూ.2,900

పత్తికి రూ.9,200.. మొక్కజొన్నకు రూ.2,900 ధరలు పెరగడంతో రైతుల హర్షం కాకతీయ, కేసముద్రం: కేసముద్రం...

ఏనుమాములలో ధరల మోసం.. ఇద్దరి లైసెన్సులు రద్దు!

ఏనుమాములలో ధరల మోసం.. ఇద్దరి లైసెన్సులు రద్దు! 190 బస్తాల మిర్చి ధరలో...

పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి శాంతిభద్రతల పరిరక్షణకు...

పి ఆర్ టి యు రాష్ట్ర శాఖ ఎన్నికల్లో మండల సభ్యులకు చోటు

పి ఆర్ టి యు రాష్ట్ర శాఖ ఎన్నికల్లో మండల సభ్యులకు...

జీడబ్ల్యూఎంసీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటిన వేడుకలు

జీడబ్ల్యూఎంసీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటిన వేడుకలు పూల సోయగాలతో ముస్తాబైన ప్రాంగణం...

మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ పేద, నిరుద్యోగ మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం జాతీయ ఎస్టీ...

బతుకమ్మ సంబరాల్లో ములుగు కలెక్టరేట్‌

బతుకమ్మ సంబరాల్లో ములుగు కలెక్టరేట్‌ మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.