epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎస్సీ, ఎస్టీ కేసు విచారణలో తప్పిదాలపై ఫిర్యాదు..

ఎస్సీ, ఎస్టీ కేసు విచారణలో తప్పిదాలపై ఫిర్యాదు..

సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి..

పోలీస్‌ కమిషనర్‌ శ్వేతకు జర్నలిస్టుల వినతి..

కాకతీయ, హనుమకొండ :ఎస్సీ, ఎస్టీ కేసు (ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ 471/2025) విచారణలో జరిగినట్లు ఆరోపిస్తున్న తప్పిదాలపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జర్నలిస్టులు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేతకు శనివారం ఫిర్యాదు చేశారు. సుబేదారి పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఈ కేసులో తాము సాక్షులుగా ఉన్నామని జర్నలిస్టులు గడ్డం కేశవమూర్తి, తోట సుధాకర్‌, పెండెం వేణుమాధవ్‌, మేరుగుల రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. అయితే, విచారణ అధికారిగా వ్యవహరించిన హనుమకొండ ఏసీపీ నరసింహారావుతో పాటు ఇతర పోలీసు అధికారులు ఎవరూ తమను విచారణకు పిలవలేదని, తమ నుంచి ఎలాంటి వాంగ్మూలాలు కూడా తీసుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయినప్పటికీ, 2025 ఆగస్టు 15న ఏసీపీ సమక్షంలో తాము వాంగ్మూలాలు ఇచ్చినట్లు పత్రాలు రూపొందించి, వాటిని న్యాయస్థానానికి సమర్పించి కేసును మూసివేసినట్లు తమ దృష్టికి వచ్చిందని వివరించారు. ఈ విషయంపై సంబంధిత ఏసీపీని సంప్రదించగా, కేసు మూసివేసినట్లు తెలిపారని పేర్కొన్నారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కేసును ఎలా మూసివేస్తారని ప్రశ్నించగా, ఏమైనా ఉంటే కోర్టుకు వెళ్లి చూసుకోవాలని సమాధానమిచ్చినట్లు తెలిపారు. తమను విచారించకుండానే తమ పేర్లతో వాంగ్మూలాలు ఎలా నమోదు చేశారు? వాటిని ఏ ఆధారాలతో న్యాయస్థానానికి సమర్పించారు? అనే అంశాలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని వారు కోరారు. సంబంధిత పోలీసు రికార్డులు, వాంగ్మూలాలు, న్యాయస్థానానికి సమర్పించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, తప్పిదాలకు బాధ్యులుగా తేలిన అధికారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు ద్వారా పొందిన పత్రాలను కూడా పోలీస్‌ కమిషనర్‌కు అందజేశారు. జర్నలిస్టుల ఫిర్యాదు, వారు సమర్పించిన పత్రాలను పరిశీలించిన పోలీస్‌ కమిషనర్‌ శ్వేత సానుకూలంగా స్పందించినట్లు ఫిర్యాదుదారులు తెలిపారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి విచారణ జరిపిస్తామని, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇదే ఎస్సీ, ఎస్టీ కేసుకు సంబంధించి బాధితుడు కంకనాల సంతోష్‌ కూడా తనకు జరిగిన అన్యాయాన్ని పోలీస్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. తన ఫిర్యాదుపై విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్‌ వెల్ఫేర్‌ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ వల్లాల వెంకటరమణ, టీయూడబ్ల్యూజే హన్మకొండ జిల్లా అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి, ప్రధాన కార్యదర్శి ఊటుకూరు సాయిరాం, కోశాధికారి పొడిచెట్టి విష్ణువర్ధన్‌, గ్రేటర్‌ వరంగల్‌ ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు వేముల నాగరాజు, టీయూడబ్ల్యూజే రాష్ట్ర బాధ్యులు పి. వేణుమాధవ్‌, తోట సుధాకర్‌, బోళ్ల అమర్‌, మేరుగుల రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నంబర్ ప్లేట్ లేదు.. దర్పం మాత్రం ఫుల్!

నంబర్ ప్లేట్ లేదు.. దర్పం మాత్రం ఫుల్! జిల్లా యూత్‌ ప్రెసిడెంట్‌ బోర్డుతో...

బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు కరువు

బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు కరువు ఎమ్మెల్యే చెప్పినా అరకొర వసతులే మూడేండ్లుగా సొంత ఖర్చులతో...

అష్టలక్ష్మి అవతారంలో దుర్గామాత

అష్టలక్ష్మి అవతారంలో దుర్గామాత కాకతీయ, దుగ్గొండి: మండల కేంద్రంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో...

క్రీడలతోనే సంపూర్ణ మానసిక ఉల్లాసం

క్రీడలతోనే సంపూర్ణ మానసిక ఉల్లాసం యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి గ్రామీణ క్రీడాకారులను...

సద్దుల బతుకమ్మకు ఘనంగా ఏర్పాట్లు

సద్దుల బతుకమ్మకు ఘనంగా ఏర్పాట్లు ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్‌ చైర్మన్‌ బానోత్‌ సునీత...

రూ.5ల‌క్ష‌ల విలువైన ఎండు గంజాయి ప‌ట్టివేత‌

రూ.5ల‌క్ష‌ల విలువైన ఎండు గంజాయి ప‌ట్టివేత‌ కేసముద్రం పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు కాకతీయ,...

ములుగు మత్తులో.. సిండికేట్‌ సత్తా!

ములుగు మత్తులో.. సిండికేట్‌ సత్తా! జిల్లాలో 2,700ల‌కు పైగా బెల్ట్‌ షాపులు ప్ర‌తీ గ్రామంలో...

20న‌ ట్రైసిటీలో ట్రాఫిక్‌ ఆంక్షలు

20న‌ ట్రైసిటీలో ట్రాఫిక్‌ ఆంక్షలు మ‌ధ్యాహ్నం 3 నుంచి 21న తెల్లవారుజామున 3...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.