అష్టలక్ష్మి అవతారంలో దుర్గామాత
కాకతీయ, దుగ్గొండి: మండల కేంద్రంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు దుర్గామాతను అష్టలక్ష్మి అవతారంలో రూ.2,01,000 విలువైన ఆభరణాలతో అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు కూస సుమన్, సాంబరాజు బిక్షపతి, అలవాలా పవన్, సందీప్, పుత్తిన్, పునీత బాలు, పురోహితుడు శివయ్య తదితరులు పాల్గొన్నారు.

