epaper
Saturday, October 31, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రజల భద్రతకు భరోసా..

ప్రజల భద్రతకు భరోసా..

నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యమే ధ్యేయం: పోలీస్ కమిషనర్
కాకతీయ, ఖమ్మం బ్యూరో:
“ప్రజల భద్రతకు భరోసా.. నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యమే ధ్యేయంగా కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమన్ని నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు.
ఇటీవల కాలంలో టేకులపల్లి లోని కేసీఆర్ టవర్ ప్రాంతంలో కొంతమంది గంజాయి సేవిస్తున్నారని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో ఖమ్మం డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో సిఏఆర్ ఫోర్స్, టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్, ఈగల్ ఫోర్స్, క్లూస్ టీమ్, మొత్తం 286 మంది పోలీస్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేయడంతో పాటు కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా 52 బ్లాక్ లలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 62 ద్విచక్ర వాహనాలు,5 ఆటోలు స్వాధీనం చేసుకొని స్ధానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదేవిదంగా 105 మంది వేలిముద్రలు తీసుకొని పరిశీలించండం జరిగింది. గంజాయి అమ్ముతున్న ఇద్దరిని, గంజాయి సేవిస్తున్న 12 మంది, 50 గ్రాముల పొడి గంజాయి,ముగ్గురు చోరి నిందితులను, ఇద్దరు అనుమానితులు గుర్తించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. నేరరహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.ఈ ప్రాతంలో స్థానిక ప్రజలు కోరుకున్నట్లు పోలీస్ పెట్రోలింగ్ మరింత ముమ్మరం చేస్తామని, బెల్ట్ షాపులపై ఎక్సైజ్ శాఖ మాట్లాడి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ప్రధానంగా యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దు సూచించారు.
మీ కుటుంబం కోసం.. మీ పిల్లల భవిష్యత్తు కోసం.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, నేటి మీ అప్రమత్తతే.. రేపటి మీ పిల్లల భద్రమైన భవిష్యత్తన్నారు.
గంజాయి విక్రయదారుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేసి గంజాయి రహిత సమాజ నిర్మాణంలో పోలీసులకు సహకరిస్తూ..
యువత భవిష్యత్తును కాపాడటంలో భాగస్వాములు కావాలన్నారు.
అదేవిదంగా స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సీసీ కెమెరాల వల్ల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు స్థానికులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలపై, నేరస్తుల కదలికపై నిరతరం నిఘా ఉంటుందన్నారు. స్దానికంగా ఏలాంటి గొడవలకు పోకుండా ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో వుండాలని సూచించారు.
అక్రమ సంపాదనకు అలవాటు పడి మోసాలకు పాల్పడుతున్న మాయగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. అలాగే ఆన్లైన్ సైబర్ నేరగాళ్ల నుండి అప్రమత్తంగా వుండాలని, మీ బ్యాంక్ ఖాతా వివరాల కోసం వచ్చే కాల్స్, ఈమెయిల్స్ కు స్పందించవద్దని సూచించారు.
ముఖ్యంగా అపరిచితుల పట్ల అప్రమత్తంగా వుండాలని, ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తునట్లయితె స్థానిక పోలీసులకు కాని డయల్ 112కు సమాచారం ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా ఇంటిని అద్దెకు ఇచ్చేటప్పుడు వారి చిరునామా, ఆధార్ కార్డులు చూసిన తరువాతనే ఇంటిని అద్దెకు ఇవ్వాలని స్థానికులకు వివరించారు. ఇలాంటి అకస్మిక తనీఖీ ద్వారా నేరస్థులను గుర్తించడంతో పాటు నేరాలను నియంత్రించేందుకు దోహదపడుతుందన్నారు. నేరాల నియంత్రణ కోరకు నిరంతరం పోలీస్ పెట్రోలింగ్‌ వాహనాలు , బ్లూకోల్ట్స్‌ సిబ్బంది ఆయా ప్రాంతల స్థితిగతులపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడంతో పాటు పాత నేరస్థుల సమాచారాన్ని సేకరించడం చేస్తారని తెలిపారు.స్ధానిక ప్రజలకు ఎలాంటి అభద్రత భావం లేకుండా ఇలాంటి ఆకస్మికంగా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం,ఏసీపీలు రమణమూర్తి, ఎస్బీ ఏసీపీ మహేష్, సైబర్ క్రైమ్ ఏసీపీ ఫణిందర్, సిసియస్ ఏసీపీ సర్వర్, సిఐలు సాదిక్ పాషా, చిట్టిబాబు, కరుణాకర్, శివప్రసాద్, నాగరాజు, ఆర్ ఐ లు కామరాజు, శ్రీశైలం, సురేష్, పాల్గొన్నారు.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పెద్దవంగరను కరువు మండలంగా ప్రకటించాలి.

పెద్దవంగరను కరువు మండలంగా ప్రకటించాలి. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య,మండల నాయకుల...

యూరిన్ టెస్టులతో గంజాయి వినియోగదారుల గుర్తింపు.. ముగ్గురు పట్టివేత

యూరిన్ టెస్టులతో గంజాయి వినియోగదారుల గుర్తింపు.. ముగ్గురు పట్టివేత THC ఆనవాళ్లు గుర్తించిన...

ఏక్తా దివస్‌ 5కే, 10కే రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్న ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు..

ఏక్తా దివస్‌ 5కే, 10కే రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్న ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు.. కాకతీయ,...

మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి నల్ల బ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయుల నిరసన కాకతీయ,శంకరపట్నం:మోడల్...

రాష్ట్రస్థాయి క్రీడా జట్లకు చేర్యాల గురుకుల విద్యార్థులు!

రాష్ట్రస్థాయి క్రీడా జట్లకు చేర్యాల గురుకుల విద్యార్థులు! * కబడ్డీ, వాలీబాల్‌తో పాటు...

ప్రజా సమస్యలపై ప్రశ్నల వర్షం!

ప్రజా సమస్యలపై ప్రశ్నల వర్షం! * ముస్త్యాల రైతు వేదికలో సర్వసభ్య సమావేశం.....

పట్టభద్రులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలి!

పట్టభద్రులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలి! అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి పట్టభద్రుల...

కేశవపట్నంలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

కేశవపట్నంలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ 72 వాహనాలు సీజ్.. ప్రజలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.