epaper
Saturday, October 31, 2026
epaper
BREAKING NEWS
Loading News...

భూ గ‌ద్ద‌లు

భూ గ‌ద్ద‌లు
కాజీపేట‌లో భూ గోల్‌మాల్‌
వైఎస్సార్ న‌గ‌ర్ గుడిసెల‌పై భూదందా నీడ!
వంద‌ల కోట్ల విలువ చేసే ప్ర‌భుత్వ భూమి ప్రైవేటు ప‌రం
అర్బ‌న్ సీలింగ్ యాక్టు ఎత్తివేత త‌ర్వాత రికార్డుల్లో మార్పులు
అది ప్ర‌భుత్వ భూమేనంటూ స్ప‌ష్టం చేస్తున్న కాజీపేట వాసులు
అస‌లు య‌జ‌మాని ఎవ‌రో ఎవ‌రికి తెలియ‌దు..!
తెర‌పైకి రారు..మోఖా మీద క‌న‌బ‌డ‌డు..
ఏ అండ లేని గుడిసెవాసుల‌పై ఓ లీడ‌ర్‌ రాజ‌కీయ ప్ర‌తాపం
రెండు దశాబ్దాలుగా నివాస‌ముంటున్న అత్యంత నిరుపేద‌లు
నాటి ముఖ్య‌మంత్రి వైఎస్సార్ పేరుతో కాల‌నీ ఏర్పాటు చేసుకున్న పేద‌లు
స్వ‌యంగా కాల‌నీని సంద‌ర్శించి అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పొన్నాల హామీ
గ‌తంలో ఇంటినెంబ‌ర్లు మంజూరు.. ఇప్పుడు ఖాళీ చేయించే యత్నాలు
ఏడు నెల‌లుగా వారిని ఖాళీ చేయించేందుకు కుట్ర‌లు, ఒత్తిళ్లు
మూడు నెల‌ల్లో మ‌న‌స్తాపంతో ఐదుగురు మృతి..ముగ్గురు ఆత్మ‌హత్యాయ‌త్నం
అయినా మాన‌వ‌త్వం గుర్తెరుగ‌ని జిల్లా యంత్రాంగం!
120 కుటుంబాల బతుకులను బజారుపాలు చేసే ప్రయత్నం

– కాక‌తీయ / ఎడిట‌ర్ అరెల్లి కిర‌ణ్ గౌడ్‌

రెండు దశాబ్దాలుగా ఆ భూమినే నమ్ముకుని బతుకుతున్న పేదల బతుకులు ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు.. ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని నివాసం ఏర్పరచుకున్నాయి. కాలక్రమంలో ప్రభుత్వం ఇంటి నంబర్లు కేటాయించింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌ పేరుతో కాలనీ ఏర్పడింది. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దలు సైతం కాలనీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్వయంగా కాలనీని సందర్శించి పేదలతో మాట్లాడారు. అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ఇంతకాలం తమ నివాసాలకు భద్రత ఉంటుందని భావించిన ఆ కుటుంబాలకు ఇప్పుడు గుడిసెలు తొలగించుకోవాలనే ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. అసలు ప్రభుత్వ భూమిగా ఉన్న స్థలం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లింది? దశాబ్దాలుగా నివసిస్తున్న పేదలను ఖాళీ చేయించేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారు? తెరవెనుక ఏం జరుగుతోంది? అన్న ప్రశ్నలు స్థానికంగా చర్చనీయాంశమవుతున్నాయి.

120 కుటుంబాల నివాసం

కాజీపేట మండల పరిధిలోని సర్వే నంబర్లు 70, 71, 72లో మొత్తం 20 ఎకరాల 37 గుంటల భూమి ఉన్నట్లు అందుబాటులో ఉన్న వివరాలు సూచిస్తున్నాయి. ఇందులో 70/A/1లో 4 ఎకరాలు, 70/B/1లో 4 ఎకరాలు, 70/C/1లో 3 ఎకరాల 17 గుంటలు, 71/A/1లో 3 ఎకరాలు, 71/C/1లో 2 ఎకరాల 25 గుంటల్లో ఇళ్ల నిర్మాణం జరిగినట్లు రికార్డు వివరాల్లో ఉంది. ఈ ఐదు విభాగాల్లో కలిపి 17 ఎకరాల 2 గుంటల్లో ఇళ్లు నిర్మించగా, మరో 3 ఎకరాల 35 గుంటలు మిగిలి ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో 2003 నుంచి సుమారు 120 మంది పేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నట్లు స్థానికుల సమాచారం. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ఈ ప్రాంతంతోనే వారి జీవన సంబంధం కొనసాగుతోంది. ఇక్కడి కుటుంబాలకు ప్రభుత్వం ఇంటి నంబర్లు కేటాయించిందని చెబుతున్నారు. దీంతో తాము నివసిస్తున్న ప్రాంతానికి ప్రభుత్వ గుర్తింపు ఉందనే నమ్మకంతో వారు జీవిస్తున్నారు.

నాటి పాలకుల భరోసా..

నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతానికి వైఎస్సార్‌ పేరు పెట్టుకుని కాలనీగా ఏర్పాటు చేసుకున్నారు. కాలనీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అప్పటి ప్రభుత్వ పెద్దలు అధికారులకు సూచించినట్లు స్థానికులు చెబుతున్నారు. నాటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్వయంగా కాలనీకి వచ్చి పేదలతో మాట్లాడటం, అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భరోసా ఇవ్వడం అప్పట్లో వారికి ఆశలు కల్పించింది. ప్రభుత్వ ఇంటి నంబర్లు, కాలనీ గుర్తింపు, ప్రజాప్రతినిధుల పర్యటనలు.. ఇవన్నీ తమ నివాసాలకు రక్షణగా నిలుస్తాయని పేదలు భావించారు. కానీ ఇప్పుడు అదే స్థలాన్ని ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వ హామీలతో ఏర్పడిన కాలనీలో నివసిస్తున్న కుటుంబాలకు ప్రత్యామ్నాయం చూపకుండా ఖాళీ చేయించే ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయన్నది ప్రశ్నగా మారింది.

రికార్డుల మార్పుపై అనుమానాలు..

ఈ భూముల చరిత్రలో పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టానికి సంబంధించిన పాత ప్రభుత్వ రికార్డులు కీలకంగా కనిపిస్తున్నాయి. 1995 జనవరి 16న కాజీపేట పరిధిలోని సర్వే నంబర్లు 70, 71, 72 తదితర ప్రాంతాలకు సంబంధించి 58,154 చదరపు మీటర్ల భూమిని మిగులు భూమిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పాత రికార్డుల్లో ఉంది. అనంతరం 1995 మే 5న చట్టంలోని సెక్షన్‌ 10(1) కింద నోటిఫికేషన్‌ జారీ చేసి, జూన్‌ 6న గెజిట్‌లో ప్రచురించినట్లు ఆ పత్రాలు పేర్కొంటున్నాయి. అయితే భూ యజమానుల వారసులు హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయపరమైన వివాదం తలెత్తింది. కోర్టు స్టే నేపథ్యంలో భూముల వ్యవహారం పెండింగ్‌లో ఉన్నట్లు 1997లో ప్రభుత్వానికి పంపిన నివేదికల్లో ప్రస్తావించారు. ఇదే సమయంలో సర్వే నంబర్లు 71, 72లోని 22,065 చదరపు మీటర్ల భూమిని ఆర్టీసీ బస్‌ డిపో లేదా బస్‌స్టాండ్‌ కోసం ప్రతిపాదించినట్లు కూడా రికార్డుల్లో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం రద్దు నేపథ్యంలో భూ రికార్డుల్లో మార్పులు జరిగాయని, ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల పేర్లకు మారిపోయిందని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ మార్పులు ఎప్పుడు జరిగాయి? ఏ ఉత్తర్వుల ఆధారంగా జరిగాయి? భూమి యాజమాన్య హక్కులు ఎవరికి ఉన్నాయి? అన్న విషయాలపై సమగ్ర విచారణ జరగాల్సి ఉంది.

గుడిసెల తొలగింపునకు ఒత్తిళ్లు..

కాలనీలోని గుడిసెలను ఖాళీ చేయించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కాజీపేటకు చెందిన ఓ రాజకీయ నాయకుడు ఈ విషయంలో ముందుండి వ్యవహరిస్తున్నట్లు స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుడిసెల తొలగింపునకు కిరాయి కూలీలను తీసుకువస్తున్నారని, రౌడీ మూకలతో దాడులకు దిగుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇళ్ల వద్ద లేని సమయంలో గుడిసెలను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ప్రశ్నించిన వారికి పోలీసులను ఆశ్రయించాలని సూచిస్తున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా తగిన స్పందన లేదని బాధితులు వాపోతున్నారు. అధికార పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధి ఈ వ్యవహారంపై మౌనం వహించడం కూడా అనుమానాలకు తావిస్తోందని స్థానికులు అంటున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత నాయకులు, అధికారుల వివరణ తెలియాల్సి ఉంది.

పేదల భవిష్యత్తు ప్రశ్నార్థకం

మొత్తం 20 ఎకరాల 37 గుంటల భూమిలో ఇళ్ల నిర్మాణం జరిగిన విస్తీర్ణం 17 ఎకరాల 2 గుంటలుగా చూపిస్తుండగా, మరో 3 ఎకరాల 35 గుంటలు మిగిలి ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వందల కోట్ల విలువ ఉంటుందని భావిస్తున్న ఈ భూమిపై రాజకీయ, అధికార, ప్రైవేటు వ్యక్తుల కూటమి కన్నేసిందని స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణల్లో వాస్తవమెంత? ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల పేర్లకు మారిందా? మారితే ఏ అధికారి ఆమోదంతో మారింది? భూమి బదిలీల వెనుక ఎలాంటి లావాదేవీలు జరిగాయి? అన్న ప్రశ్నలకు అధికారిక రికార్డులే సమాధానం చెప్పాలి. మరోవైపు, దశాబ్దాలుగా అక్కడే నివసిస్తున్న 120 కుటుంబాల భవిష్యత్తు ఏమిటన్నది కీలకంగా మారింది. కాలనీకి గతంలో ఇచ్చిన గుర్తింపు, ఇంటి నంబర్ల కేటాయింపు, అభివృద్ధి హామీలను పరిగణనలోకి తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్‌, రెవెన్యూ అధికారులు భూమి యాజమాన్య రికార్డులు, మిగులు భూమి ఉత్తర్వులు, హైకోర్టు ఆదేశాలు, తదుపరి భూ బదిలీలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మోహన్‌ గ్రానైట్‌ క్వారీ మూసివేతకు ఆదేశాలు!

మోహన్‌ గ్రానైట్‌ క్వారీ మూసివేతకు ఆదేశాలు! లీజు గడువు ముగిసినా కొనసాగుతున్న తవ్వకాలు తండావాసుల...

పర్యాటకమే ప్రాణం.. ఓరుగల్లు కీర్తే లక్ష్యం!

పర్యాటకమే ప్రాణం.. ఓరుగల్లు కీర్తే లక్ష్యం! చరిత్రను పరిచయం చేస్తూ.. వారసత్వ సంపదకు...

ఆరుతడి పంటలు సాగు చేయాలి

ఆరుతడి పంటలు సాగు చేయాలి ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులపై అవగాహన తక్కువ నీటితో...

ఏక్తా దివస్‌ రన్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల ఉత్సాహం

ఏక్తా దివస్‌ రన్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల ఉత్సాహం 5కే, 10కే పరుగుల్లో వందమంది...

మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి

మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి బాలికల గురుకులంలో ప్ర‌త్యేకాధికారి అనురాధ ఆకస్మిక తనిఖీలు ఆహార...

పంచాయతీల్లో నిధులు గోల్‌మాల్‌

పంచాయతీల్లో నిధులు గోల్‌మాల్‌ ములుగు జిల్లా పంచాయ‌తీల్లో అవినీతి బాగోతం చెల్లింపుల్లో అక్రమాలు.. రికార్డుల్లో...

యూత్‌ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌!

యూత్‌ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌! బీజేవైఎం మండల అధ్యక్షుడు రాచర్ల రాజేష్‌...

పెంచికలపేట పీఏసీఎస్‌కు కొత్త సారథి!

పెంచికలపేట పీఏసీఎస్‌కు కొత్త సారథి! చైర్మన్‌గా ఎగితే లింగన్న బాధ్యతల స్వీకరణ గ్రామానికి తొలిసారి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.