రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు.
కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని గట్లకుంట ఎక్స్ రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం కోరిపల్లి గ్రామానికి చెందిన ఎర్ర ప్రవీణ్ ద్విచక్రవాహనంపై శుక్రవారం సాయంత్రం కోరిపల్లి నుండి మండల కేంద్రానికి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రక్కన రౌతూనూ ఢీకొనడంతో ప్రమాదానికి గుర య్యాడు. ఈ ఘటనలో ప్రవీణ్ తలకి తీవ్రంగా గాయలాయ్యాయి . స్థానికుల సమాచారంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం తోర్రుర్ ఏరియా హాస్పత్రికి తరలించారు.పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

