సాఫ్ట్‌బాల్ క్రీడలో సత్తా చాటాలి
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ నిరూపించుకోవాలి
కరీమాబాద్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి. జయప్రకాష్
కాకతీయ, వరంగల్: హనుమకొండ జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుని క్రీడాకారులు పోటీల్లో రాణించాలని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, కరీమాబాద్ ప్రధానోపాధ్యాయుడు బి. జయప్రకాష్ కోరారు. గురువారం పాఠశాల ఆవరణలో నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా అసోసియేషన్ శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. సాఫ్ట్‌బాల్ కోచ్ పోలేపాక వినయ్‌కుమార్ మాట్లాడుతూ ఈ నెల 14 నుంచి నిజామాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ క్రీడా మైదానంలో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. శిక్షణ పొందిన వారికి వరంగల్ డిఫెన్స్ అకాడమీలో వసతి సౌకర్యం కల్పించామన్నారు. ముగింపు కార్యక్రమంలో విద్యార్థులకు సాఫ్ట్‌బాల్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఉపాధ్యాయులు భాగ్యలక్ష్మి, సంధ్యారాణి, సుకన్య, బిక్షపతి, ఉమాకుమారి, సబిత, ప్రవీణ్, సీనియర్ క్రీడాకారుడు శివకుమార్, శిక్షణ పొందిన క్రీడాకారులు పాల్గొన్నారు.

