epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గెస్ట్ లెక్చరర్లను యథావిధిగా కొనసాగించాలి: ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి అసోసియేషన్ ప్రతినిధుల విన‌తి

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న 1654 మంది గెస్ట్ లెక్చరర్ల‌ను య‌థావిధిగా కొన‌సాగించాల‌ని ప్ర‌భుత్వ స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్‌రెడ్డిని అసోసియేష‌న్ ప్ర‌తినిధులు కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల మేనిఫెస్టోలో కూడా ఈ విష‌యాన్ని చేర్చార‌ని, దాన్ని ప్ర‌కారం గెస్ట్ లెక్చరర్ల‌కు న్యాయం చేయాల‌ని కోరారు.

రెన్యూవల్ మరియు రెగ్యూలర్ లెక్చరర్ల నియామకం వల్ల డిస్టర్బ్ అయిన వారిని అడ్జస్ట్ మెంట్ చేయడానికి సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఇంటర్ బోర్డు కార్యదర్శి పోస్టుల త‌గ్గింపునకు చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని అన్నారు. 13-06-25 న ప్రభుత్వ ఆమోదం కోసం పంపిన 1654 గెస్ట్ ఫ్యాకల్టీ కంటిన్యూయేషన్ ఫైల్ లో ఫైనాన్స్ అధికారులు వివిధ కారణాలు చూపి పోస్టుల సంఖ్య తగ్గింపు చేస్తున్నార‌ని, కేవలం 398 పోస్టులకు మాత్రమే జీవో ఇస్తున్నార‌ని అన్నారు.

అదే జరిగితే దాదాపు 1300 మంది కుటుంబాల పరిస్థితి ప్రశ్నార్థకం కానుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ విష‌యంపై 398 పోస్టులతో కళాశాలల నిర్వాహణ కష్టమ‌వుతుంద‌ని తేది: 21/08/2025 నాడు బోర్డ్ సెక్రటరీ అదనంగా 1256 పోస్టులకు అనుమతివ్వాలని ప్రభుత్వానికి మళ్ళీ ప్రతిపాదనలను పంపడం జరిగింద‌న్నారు. దానిపై ఫైనాన్స్ అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేద‌ని అన్నారు. 1654 పోస్టులలో సంఖ్య తగ్గిస్తే దాదాపు 1300 మంది రోడ్డున పడుతున్నారని కేవలం 398 పోస్టులతో అనుమతివ్వకుండా మొత్తం 1654 (398+1256) పోస్టులకు అనుమతివ్వాలని వేం న‌రేంద‌ర్‌రెడ్డిని కోరారు.

గత సంవత్సరానికి సంబంధించిన 4 నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్య‌క్షుడు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్, అసోసియేట్ ప్రెసిడెంట్ కోడి మహేష్ కుమార్, ఎం.బాబురావు, సంయుక్త కార్యదర్శులు కె. వెంకటేష్, రాంచందర్ లు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌తినిధుల విన‌తిపై వేం స్పందిస్తూ ఈ విషయాన్ని సీఎం మరియు డిప్యూటీ సీఎం ల దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.